14 ఏళ్ల బ్రిటిష్ స్ప్రింటర్ డివైన్ ఇహెమ్ తన అద్భుతమైన వేగంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. నైజీరియాలో పుట్టిన ఇహెమ్, లీ వ్యాలీ అథ్లెటిక్స్ సెంటర్లో జరిగిన అథ్లెటిక్స్ మీట్లో 100 మీటర్ల రేసును కేవలం 10.3 సెకన్లలో పూర్తి చేశాడు. ఇది జమైకా స్ప్రింటర్ సచిన్ డెన్నిస్ నెలకొల్పిన 10.51 సెకన్ల రికార్డును బద్దలు కొట్టింది. ఇహెమ్ వయస్సు కేటగిరీలో (Under-15) కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు.

ఇహెమ్ తన చిన్న వయస్సులోనే మూడు సార్లు రికార్డును బద్దలు కొట్టాడు, అయితే 10.46, 10.48, 10.49 సెకన్లలో వాయు సహాయంతో సాధించిన ఈ విజయాలు చెల్లుబాటు కావు. ఇహెమ్ యొక్క తల్లిదండ్రులు ఇన్నోసెంట్ మరియు కిరుకు 2002 కామన్వెల్త్ గేమ్స్‌లో నైజీరియాకు ప్రాతినిధ్యం వహించారు.
ఇహెమ్ వ్యక్తిగత కోచ్ అయిన కిరుకు UKలో PWD అథ్లెటిక్ అకాడమీని స్థాపించారు. ఉసేన్ బోల్ట్ మరియు అలిసన్ ఫెలిక్స్ వంటి స్ప్రింటింగ్ దిగ్గజాల నుంచి ప్రేరణ పొందిన ఇహెమ్, భవిష్యత్తులో గ్రేట్ బ్రిటన్‌కు ప్రాతినిధ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని అద్భుతమైన ప్రతిభతో, 2028లో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో అతను ఏమి సాధించగలడో ఊహించవచ్చు.
రేస్ వీడియో
THIS GUY IS RIDICULOUS!! 😱😱😱 10.56s!!! 🔥 AT FOURTEEN
Another UK U-15 record ☑️Divine Iheme 🇬🇧 once again rewrites the UK history books as he wins the UK U-15 100m title in 10.56s (0.7), just missing Sachin Dennis 🇯🇲 age 14 world record of 10.51s.
WHAT A TALENT!!! pic.twitter.com/iTzq6fx1PL
— World Athletics Hub (@wldathleticshub) July 27, 2024
10.30s!!!! 🔥 HE’S DONE IT!
Age 14 World Record ☑️Divine Iheme 🇬🇧 smashes the World Age 14 100m record as he clocks a blistering 10.30s (1.7) at Lee Valley.
The previous record was held by Sachin Dennis 🇯🇲 with 10.51s
10.30s at 14 YEARS OF AGE!! 🔥🤯🤯🤯😱 pic.twitter.com/skczO4Jcrh
— World Athletics Hub (@wldathleticshub) August 26, 2024