స్విట్జర్లాండ్ కి చెందిన లాసానే నగరంలో జరిగిన, లాసానే డైమండ్ లీగ్లో భారతదేశానికి చెందిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా, తన అద్భుత ప్రదర్శనతో మరోసారి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో నీరజ్, తన అత్యుత్తమ ప్రదర్శనతో 2వ స్థానం సాధించి దేశానికి గర్వకారణం అయ్యాడు.

జావెలిన్ త్రోలో ప్రపంచవ్యాప్తంగా ఒక మెరుగైన క్రీడాకారుడిగా నిలిచిన నీరజ్, 89.49 మీటర్లు దూరం త్రో చేసి 2వ స్థానంలో నిలిచాడు. లాసానే డైమండ్ లీగ్లో ఇతర దేశాల ప్రాతినిధ్యాన్ని ధీటుగా ఢీకొట్టిన నీరజ్, తన ప్రదర్శనతో మరియు ఉత్తమ ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు.
కరేబియన్ దీవులలో, గ్రెనడా దేశానికి చెందిన 26 ఏళ్ళ ఆండర్సన్ పీటర్స్ 90.81 మీటర్లు త్రో విసిరి మొదటి స్థానంలో ఉన్నాడు. కానీ నీరజ్ సిల్వర్ మెడల్కి పాత్రమైన ప్రదర్శన కూడా ప్రశంసనీయం. నీరజ్ చోప్రా మరియు భారతదేశానికి, లాసానేలో సాధించిన ఈ విజయం మరో ఘనతగా నిలిచింది.
వీడియో
India's Olympic medalist
Neeraj Chopra made silver in Lausanne Diamond League in spite of groin injury he threw a massive 89 49 metre & got 2nd spot.
India is a country where silver is disappointment & Bronze🥉medal is celebrated like a big thing pic.twitter.com/aVMx4pBSLM— 💝🌹💖🇮🇳jaggirmRanbir🇮🇳💖🌹💝 (@jaggirm) August 22, 2024
Neeraj Chopra throws a season best to finish second in the Lausanne Diamond League. He was struggling initially but finished on a strong note in the final throws.💙🔥
The 89.49m throw is now his second best career throw. Neeraj Chopra, the master of consistency.🇮🇳#LausanneDL… pic.twitter.com/GUNKMm5ow4
— Sportskeeda (@Sportskeeda) August 22, 2024