Shikhar Dhawan Retirement
భారత క్రికెటర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. శక్తివంతమైన బ్యాటింగ్‌తో పాటు తన ప్రత్యేక శైలితో పేరుగాంచిన ధావన్, 2010లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. వన్డేలు, T20లు లాంటివాటిలో అతని ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయి.
అతను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో కలిసి భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గాయాలు, యువ ఆటగాళ్ల నుంచి వచ్చిన పోటీ వల్ల అతనికి ఇటీవలి కాలంలో జట్టులో స్థానం కష్టమైందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ, అతని క్రికెట్ ప్రయాణం భారత జట్టుకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. ధావన్ చేసిన సాహసాలు, ప్రత్యేక ఇన్నింగ్స్‌లు అభిమానులను సంతోషపరిచాయి
తనకు ఇండియన్ క్రికెట్ టీం తరపున ఆడినందుకు చాల గర్వంగా ఉందని, తనను సెలెక్ట్ చేసిన సెలెక్టర్లను, బీసీసీఐ ని అభినందించాడు. తనకు కోచింగ్ ఇచ్చిన తన కోచ్ కి కూడా థాంక్స్ చెప్పాడు.
ఇప్పటినుండి తన కుటుంబంతో సమయం గడుపుతానని, క్రికెట్ లో కామెంటేటర్ లేదా కోచింగ్ లాంటి వాటిలో అవకాశం వస్తే చేస్తానని చెప్పాడు.

శిఖర్ ధావన్ రికార్డులు
ఐసిసి వరల్డ్ వన్డే XI: 2013లో ధావన్ ఈ జట్టులో చోటు సంపాదించారు.
వేగవంతమైన టెస్టు సెంచరీ: ధావన్ 174 బంతుల్లో 187 పరుగులతో టెస్టు రంగప్రవేశం చేశాడు.
2015 ఐసిసి ప్రపంచ కప్: ఈ టోర్నమెంట్లో భారతదేశం తరఫున ప్రధాన స్కోరర్‌గా నిలిచాడు.
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ: వరుసగా రెండు గోల్డెన్ బ్యాట్లను గెలుచుకున్న ఏకైక ఆటగాడు.
2013 వన్డే సెంచరీలు: ఆ ఏడాది అత్యధిక వన్డే సెంచరీలు సాధించాడు.
విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2014: 2014లో ఈ గౌరవం పొందాడు.
టెస్టు సెంచరీ: టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు భోజనానికి ముందు సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాట్స్‌మన్.
వన్డే పరుగులు: వన్డేల్లో అత్యంత వేగంగా 1000 (ఉమ్మడిగా), 2000, 3000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్.
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ: 2013, 2017లో అత్యధిక పరుగులు సాధించాడు.
ఐసిసి టోర్నమెంట్లలో 1000 పరుగులు: అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్.
ఆసియా కప్ 2018: ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.
IPL 2020: ధావన్ లీగ్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
2021 అర్జున అవార్డు: క్రీడల్లో అతని అత్యుత్తమ విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డు అందుకున్నారు.
వీడియో
శిఖర్ ధావన్ మాటలు హిందీలో
As I close this chapter of my cricketing journey, I carry with me countless memories and gratitude. Thank you for the love and support! Jai Hind! 🇮🇳 pic.twitter.com/QKxRH55Lgx
— Shikhar Dhawan (@SDhawan25) August 24, 2024