భారత దేశానికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన హర్విందర్ సింగ్ | Harvinder Singh Won Gold Medal in Para Archery

WhatsApp Group Join Now

హర్విందర్ సింగ్ 2024 పారిస్ పారాలింపిక్స్‌లో భారతదేశానికి తొలి ఆర్చరీ బంగారు పతకాన్ని తెచ్చిపెట్టారు. పురుషుల వ్యక్తిగత ఆర్చరీ  రికర్వ్ ఓపెన్ ఈవెంట్‌లో పోలాండ్‌ అథ్లెట్ లూకాస్ సిస్జెక్‌ను 6-0తో ఓడించి ఈ ఘనత సాధించారు. ఈ విజయంతో హర్విందర్ భారత పారాలింపిక్ అథ్లెట్లకు గొప్ప ప్రేరణగా నిలిచారు.

Harvinder Singh Won Gold Medal in Para Archery
భారత దేశానికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన హర్విందర్ సింగ్

హర్విందర్ సింగ్ కుటుంబ నేపథ్యం మరియు ప్రేరణ

హర్విందర్ సింగ్ హర్యానాలోని కైతాల్‌లో 1991 ఫిబ్రవరి 25న జన్మించారు. చిన్నతనం లోనే డెంగీ జ్వరానికి గురై, చికిత్స కారణంగా కాళ్లలో సమస్య ఎదుర్కొన్నారు.

2012లో లండన్ పారాలింపిక్స్‌ను చూసి ప్రేరణ పొందిన హర్విందర్, ఆర్చరీలో తన లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నారు. అతని తండ్రి హర్విందర్‌కి అనేక విధాలా తోడ్పాటు అందించారు. కోవిడ్ సమయంలో, ఆయన తండ్రి తమ పొలాన్ని ఆర్చరీ ప్రాక్టీస్ కోసం రేంజ్‌గా మార్చారు, ఇది హర్విందర్ సాధనకు ఎంతో తోడ్పడింది.

హర్విందర్ సింగ్ మునుపటి విజయాలు

2017: హర్విందర్ తొలిసారి పారా ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ఏడవ స్థానంలో నిలిచారు.

2018: జకార్తా ఆసియా పారా గేమ్స్‌లో తన మొదటి బంగారు పతకాన్ని సాధించారు.

2020: టోక్యో పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి, పారా ఆర్చరీలో పతకం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచారు.

2022: హాంగ్జౌ ఆసియా పారా గేమ్స్‌లో టీమ్‌తో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

2024: పారిస్ పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించారు.

Harvinder Singh Won Gold Medal in Para Archery

విద్యా ప్రయాణం

పటియాలాలోని పంజాబీ యూనివర్సిటీ నుండి ఎకానామిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. విద్యా, క్రీడా జీవితాలను సమన్వయించడం ఆయన సమర్పణా తత్వాన్ని చూపిస్తుంది.

వీడియో

Harvinder Singh Won the Gold Medal in Para Archery Men’s Individual Recurve Open at Paralympics 2024

Webstory

Leave a Comment