ఏపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను మంగళగిరి పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన స్నేహితుడిని పరామర్శించారు. నందిగం సురేశ్‌ను అక్టోబర్ 2021లో టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు అరెస్టు చేసి, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
జగన్ మాట్లాడుతూ, “నందిగం సురేష్‌పై జరిగిన అరెస్టు అన్యాయమని, ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని” అన్నారు. “ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు తగవని, ప్రజల కోసం పనిచేసే నాయకులను ఇబ్బంది పెట్టడం సరికాదని” ఆయన అభిప్రాయపడ్డారు.
జగన్ తన పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పి, “న్యాయం కోసం పోరాడతామని, సురేష్‌కు పూర్తి మద్దతు ఉంటుందని” హామీ ఇచ్చారు.

అక్రమ అరెస్టులపై జగన్ ఇలా అన్నారు
మీరు ఒక తప్పుడు సంప్రదాయానికి (అక్రమ అరెస్టులు)బీజం వేస్తున్నారు అని జగన్ అన్నారు. మీ టీడీపీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని అన్నారు. ఇదే తప్పుడు సంప్రదాయం రేపు ఒక సునామి అవుతుందని, రేపు మీ నాయకులందరికీ ఇదే గతి పడుతుందని, ఇవే జైళ్లలో మీరు మగ్గాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పారు. రెడ్ బుక్ లు పెట్టుకోవడం పెద్ద ఘనకార్యం కాదని అది సమాజానికి మంచిది కాదని అన్నారు.
విజయవాడ వరదల విషయమై జగన్ గారు ఇలా అన్నారు
చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై, పరిపాలనను గాలికి వదిలేసాడని అన్నారు. బుధవారం నాడే శుక్రవారం నాటికీ తుఫాను వస్తుందని, భారీ స్థాయిలో వర్షాలు పడతాయని తెలిసి కూడా పట్టించుకోలేదం వాపోయారు. పైన రాష్ట్రాలనుండి వరద నీరు వస్తుందని తెలిసికొని బుధవారం అలెర్ట్ వచ్చిన రోజే, ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అధికారులను అప్రమత్తం చేస్తే ఇంత అయ్యేది కాదని అన్నారు.
వరద గురించి పట్టించుకోకుండా 4వ తారీఖున హైదరాబాద్ వెళ్లి నందిగం సురేష్ ని అరెస్ట్ చేసారని అన్నారు. విజయవాడ వరదల విషయమై చంద్రబాబు గారి ప్రభుత్వం ఫెయిల్ అయ్యి అది 60 మంది చావునకు దారి తీసిందని అన్నారు.
విజయవాడ అతలాకుతలం అవుతుంటే, దాని విషయమై టాపిక్ డైవర్ట్ చేసి నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేసారని అన్నారు.
నంబూరు శంకర్ రావు గారిపై జరిగిన దాడి గురించి జగన్ ఇలా అన్నారు
పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు గారు ఈ విపత్తు వలన జరిగిన నష్టంలో పాలు పంచుకుంటూ రైతులకు అండగా నిలబడడానికి తాను వెళ్తే తనను అడ్డగించి కారును పగులకొట్టారని అన్నారు.
ఇలా ప్రజలు వైస్సార్సీపీ నాయకులు తమ ఏరియా కి రానివ్వకుండా నిరంకుశ పాలనా చేస్తున్నారని, చంద్ర బాబు గారి తప్పుడు పనులు ఒక్కక్కటి పెరిగి శిశుపాలుడి లెక్క 100 తప్పులు వేగంగా పెరుగుతున్నాయని, టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు భూస్థాపితం అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి అని జగన్ అన్నారు.
టీడీపీ పథకాల అమలు గురించి జగన్ ఇలా అన్నారు
జగన్ చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ, “శిశుపాలుడి లెక్క తప్పుడు పనులు చేసి చంద్రబాబు భూస్థాపితం అవ్వబోతున్నాడు. టీడీపీ అమలు చేయని పథకాలు, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం చూస్తుంటే ఆ పార్టీ పతనం దగ్గర పడింది” అని అన్నారు.
అలాగే తాను హామీ ఇచ్చిన ప్రతి పిల్లవాడికి 15 వేలు ప్రతి సంవత్సరం విద్యా దీవెన పథకం పై “నీకు 15 వేలు,నీకు 15 వేలు అంటూ ట్రోల్ చేసారు.
వీడియో
రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయానికి @ncbn నాంది పలుకుతున్నారు
ఈ సంప్రదాయం రేపొద్దున సునామీ అవుతుంది.. మీ నాయకులందరికీ ఇదే గతి పడుతుంది.. ఇదే జైల్లోనే మీరంతా ఉంటారు
రెడ్ బుక్ మీరు ఒక్కరే పెట్టుకుంటామని అనుకుంటున్నారేమో.. అదేమీ పెద్ద ఘనకార్యమా?
–@ysjagan గారు, వైయస్ఆర్సీపీ… pic.twitter.com/EXp7BjFw5y
— YSR Congress Party (@YSRCParty) September 11, 2024