మొన్న మంగళగిరిలో జగన్ గారు అరెస్ట్ అయిన తమ పార్టీ నేత నందిగం సురేష్ ను పరామర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అయేషా బాను తన కుమార్తెతో కలిసి జగన్ గారితో సెల్ఫీ దిగారు. ఆమె తన అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు జగన్ గారితో ఫోటో తీసుకొని కరచాలనం చేశారు.
ఈ ఘటన సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో, కానిస్టేబుల్ అయేషా బానుకు ఇది పెద్ద సమస్యగా మారింది. జైలర్ రవిబాబు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విధుల్లో ఉన్న సమయంలో ఇలా సెల్ఫీ తీసుకోవడాన్ని క్రమశిక్షణ ఉల్లంఘనగా పేర్కొన్నారు. దీనిపై వివరణ తీసుకుని, విచారణకు కమిటీ ఏర్పాటు చేసి, ఛార్జ్ మెమో ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
ప్రజలు, వైసీపీ నాయకులు ఈ చర్యపై మండిపడుతున్నారు. ఒక సెల్ఫీ తీసుకోవడమే తప్పా? ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష్య అని భావిస్తున్నారు. చిన్న ఫోటోకి ఇంత శిక్ష చేయడం తగదని వాదిస్తున్నారు.
వీడియో
వైయస్ జగన్ గారితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్‌పై కూటమి ప్రభుత్వం కక్ష
గుంటూరు సబ్ జైలులో మాజీ ఎంపీ నందిగం సురేష్ గారిని పరామర్శించి బయటికి వచ్చిన వైయస్ జగన్ గారితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ అయేషాబాను
అయేషాబానుకి ఛార్జి మెమో ఇస్తామన్న జైలర్ రవిబాబు.. ఆమె వివరణ తర్వాత… pic.twitter.com/0jt6VIb2da
— YSR Congress Party (@YSRCParty) September 13, 2024
1 thought on “జగన్ తో సెల్ఫీ తీసుకున్నందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న లేడీ కానిస్టేబుల్ | Constable Faces Trouble for Taking Selfie with Jagan”