విజయవాడ: వరదల కారణంగా ఆటోకార్మికులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం అందిస్తున్న ₹10,000 సహాయం సరిపోదని ఆటో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. లెనిన్ సెంటర్ లో ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డ్రైవర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ప్రభుత్వ సహాయం పట్ల అసంతృప్తి
“మా నష్టం చాలా ఎక్కువగా ఉంది. కానీ ప్రభుత్వం కేవలం ₹10,000 ఇస్తామని ప్రకటించడం అన్యాయం. ప్రతి ఆటోకూ కనీసం ₹25,000 ఆర్థిక సహాయం చేయాలని మేము కోరుతున్నాం” అని కార్మికులు తెలిపారు.
ఇన్సూరెన్స్ సమస్యలు
ఇన్సూరెన్స్ కూడా సరిగా పనిచేయడం లేదని వారు వాపోయారు. ఒక నెల డబ్బులు కట్టకపోతే ఇన్సూరెన్స్ రద్దు చేస్తున్నారని, ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నా తక్కువ మొత్తాన్ని మాత్రమే ఇస్తున్నారని వారు ఆరోపించారు.
పెద్ద ఎత్తున ఆందోళన & హెచ్చరిక
ప్రభుత్వం తమ సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రత్యేకించి ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఆటోల రిపేరు పనులను వేగంగా పూర్తి చేయాలని, ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని కార్మికులు డిమాండ్ చేశారు.
వీడియో
లెనిన్ సెంటర్లో ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా.
ధర్నాలో పాల్గొన్న ఆటో డ్రైవర్లు, కార్మిక సంఘాలు.
వరదల్లో నష్టపోయిన ప్రతీ ఆటోకు ప్రభుత్వం 25 వేలు ఆర్ధిక సహాయం చేయాలి. pic.twitter.com/GQoXU5el7p
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) September 19, 2024