హైదరాబాద్ రెయిన్‌బో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. కోటి 20 లక్షలు వసూలు చేసి, మృతదేహాన్ని అప్పగించిన సంఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే, వారు ప్రశ్నించగానే ఆసుపత్రి సిబ్బంది భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు రెయిన్‌బో హాస్పిటల్ లో చోటు చేసుకున్నాయి. వైద్యం పేరుతో లక్షల్లో వసూలు చేయడం, నిర్లక్ష్యంగా వైద్యం చేయడం, మరణాలు ఆసుపత్రిపై మరిన్ని విమర్శలు తెచ్చిపెట్టాయి.
సమాచారం ప్రకారం, కొద్ది రోజుల క్రితం శ్రీశాంత్ అనే బాలుడు, ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరగా, వైద్యుల నిర్లక్ష్యంతో అతని లివర్ పాడైపోయి, చివరకు మరణించాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, న్యాయం కోరారు. వారికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 80 లక్షలు వస్తాయని హామీ ఇచ్చినా, సమస్యలు కొనసాగుతున్నాయి.

అసుపత్రి నిర్వాహకుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం అప్పగించడంలో ఆలస్యం చేయడం, అధికంగా డబ్బులు వసూలు చేయడం వంటి చర్యలు ఆసుపత్రిపై ఆరోపణలకు దారితీశాయి. పైగా, ఆసుపత్రి సిబ్బంది పట్ల కొందరు భౌతిక దాడులకు దిగిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. బాధితుల కథనాల ప్రకారం, ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2 thoughts on “ఠాగూర్ సినిమాలో లెక్క మోసం చేసిన రెయిన్ బో హాస్పిటల్ | Rainbow Hospital Huge Scam”