పేదలకు కొత్త ఇళ్లు – ఆక్రమిత ప్రాంతాలపై చర్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మూసీ నది పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16,000 పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశాలు జారీ చేయబడింది. ఈ ప్రాంతంలో నివసించే పేదలకు ప్రభుత్వం గతంలో మౌలిక సదుపాయాలు అందించింది. ఇప్పుడు, ఆక్రమణలను తొలగించి వారికి పునరావాసం కల్పించడం ప్రారంభమైంది. అక్రమ భవనాలు తొలగించే ముందు, ఆయా కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా కొత్త ఇళ్లు అందజేయనున్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్ట్ ద్వారా మూసీ నది పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్ కంటే మెరుగ్గా దీన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో పర్యాటకుల కోసం పలు సౌకర్యాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.
వేడుకలు, పర్యటనలకు హబ్
వేడుకలు, పర్యటనలకు హబ్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ఇది హైదరాబాద్ నగరానికి పర్యాటక హబ్‌గా మారబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాజెక్ట్ ను ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయాలనుకుంటోంది. పర్యాటకుల కోసం ఫుడ్ స్టాల్స్, వినోద కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇది దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారనుంది.
ఇది కూడా చదవండి – రైల్వే లో 3445 టికెట్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
1 thought on “మూసీ నది నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు | Double Bedroom Houses for Musi River Residents”