సింగనగర్ వరద బాధితులు విజయవాడ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఆందోళనకు దిగారు. తమకు వరద నష్టపరిహారం చెల్లించకపోవడం పట్ల బాధితులు ఆగ్రహంతో ఉన్నారు. బాధితులంతా తమ ఇళ్లల్లో జరిగిన నష్టాన్ని ఫోటోల ద్వారా చూపిస్తూ, న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద డిమాండ్ చేస్తున్నారు.
బాధితులలో ఒకరు మాట్లాడుతూ, “మాది న్యూ రాజరాజస్పేట. ఆదివారం వరదలు రాగా, ఇంట్లో లేకపోవడం వల్ల మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. మా ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఇంజినీరింగ్ సర్టిఫికెట్స్ లాంటి వస్తువులు అన్నీ నష్టపోయాయి. రేమ్యూనరేషన్ అధికారులు వచ్చి విచారించినప్పటికీ, ఫోన్ కి మెసేజ్ లు వచ్చిన కూడా అకౌంట్ లో డబ్బులు పడలేదనివివరించారు.

అధికారుల నిర్లక్ష్యం
మరొక బాధితుడు మాట్లాడుతూ మాకు వరద నష్టపరిహారం పడలేదు అని సచివాలయం వాళ్ళను అడుగుతుంటే కలక్టరేట్ కు వెళ్ళండి అంటున్నారు. కలక్టరేట్ కి వెళితే సచివాలయం వాళ్ళని అడగమంటున్నారు అని వాపోయారు. మాకు సరైన సమాధానం ఇవ్వట్లేదు. మేము నష్టపోయాం, కానీ న్యాయం జరగడం లేదు,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
నష్ట పరిహారం అందించడంలో వైఫల్యం
విచార కరమైన సంగతి ఏమిటంటే గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళ పేర్లు ఫస్ట్ ఫ్లోర్ అని, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ అని రాసారని, నష్టపరిహారం తప్పుగా ఇచ్చారని వాపోతున్నారు. దీని విషయమై సచివాలయం వాళ్ళని అడిగితే పట్టించుకోవడం లేదని చెప్పారు.
మద్దతుగా నిలిచినా సిపిఎం నాయకులు
సిపిఎం నాయకులు మాట్లాడుతూ, “ఇలాంటి విపత్తుల్లో ప్రభుత్వం బాధితులకు వెంటనే న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ప్రభుత్వం ఇంతవరకు బాధితుల సమస్యలను పట్టించుకోలేదు. సిపిఎం తరపున బాధితులకు మద్దతుగా నిలుస్తామని” చెప్పారు.
25,000 వేలకు ఏమి వస్తాయని వాళ్ళు నష్టపోయిన బెడ్, పరుపు కూడా రావని కనీసం 50,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పారు.
జగన్ గారి పరిపాలనలో ఇలా రోడ్డెక్కే పరిస్థితే లేదని, ప్రజలకు ఇబ్బంది లేని పరిపాలన చేసారని ఇప్పుడు అయన విలువ తెలుస్తుందని ప్రజలు వాపోయారు.
ఇది కూడా చదవండి – పిల్లవాడి బ్రతుకును మార్చేసిన విజయవాడ వరదలు
2 thoughts on “కలెక్టరేట్ ను ముట్టడించిన విజయవాడ వరద బాధితులు | Vijayawada Flood Victims Protest at Collectorate”