జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు | Choreographer Jani Master Mother Health Update

WhatsApp Group Join Now

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్‌కు గుండెపోటు వచ్చింది. ఆమెను వెంటనే నెల్లూరులో ఉన్న బొలినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

బీబీ జాన్‌కు వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణ అందిస్తున్నారు. గుండెపోటు తీవ్రత కారణంగా ఆమె ఆరోగ్యం మరింత సున్నితమైన దశలో ఉంది.

జానీ మాస్టర్ గారి భార్య అయేషా ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేసి తోడుగా ఉంటున్నారు.   కుటుంబ సభ్యులు బీబీ జాన్ ఆరోగ్యం విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీబీ జాన్‌కు వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణ అందిస్తున్నారు. గుండెపోటు తీవ్రత కారణంగా ఆమె ఆరోగ్యం మరింత సున్నితమైన దశలో ఉంది.


వైద్యులు బీబీ జాన్‌కు 24 గంటల పాటు ప్రత్యేక చికిత్స అందిస్తామని తెలిపారు. పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, కానీ తక్షణ చికిత్స వల్ల ఆరోగ్యం మెరుగు పడే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడ్డారు.

జానీ మాస్టర్‌ కోర్టు కేసు

జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు, జానీ మాస్టర్ కోర్ట్ కేసు వీటిని బట్టే తన తల్లి ఆరోగ్యం క్షీణించి ఉండవచ్చని అనుకుంటున్నారు.

తల్లి ఆరోగ్యం పట్ల కోర్టులో పిటీషన్

జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్ ఆరోగ్య పరిస్థితి గురించి కోర్టులో కూడా పిటీషన్ వేసారు. తల్లి ఆరోగ్యం బాగా మెరుగుపడేందుకు తక్షణమే కోర్టు నుండి తాత్కాలిక బెయిల్ కోరారు. కోర్టు జానీ మాస్టర్ పిటీషన్‌ను పరిశీలించి, తాత్కాలిక బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి
తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం

ఐసీఐసీఐ బ్యాంక్ 27 కోట్ల స్కామ్‌పై సీఐడీ దర్యాప్తు

వీడియో

Jani Master Mother Health Condition

1 thought on “జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు | Choreographer Jani Master Mother Health Update”

Leave a Comment