కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ తనపై జరిగిన దాడులకు సంబంధించిన కేసులు ఇంకా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడం బాధ కలిగించిందని అన్నారు. గత కొన్ని వారాలుగా తనపై కేసులు నమోదవుతున్నా, ఇంకా పార్టీ నాయకత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఆయన మీడియాతో చెప్పారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు మరియు AICC సెక్రటరీ కూడా తనకు సహకారం అందించడం లేదని ఆరోపించారు.
మైనారిటీ నేతల నుంచి కూడా సహకారం కరువు
ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ, మైనారిటీ నేతలు కూడా తనకు సపోర్ట్ ఇవ్వడం లేదని, కేవలం PCC చీఫ్ మాత్రమే కొంతమేరకు సహకరించినా, అది కూడా త్వరగా తేలిపోయిందని అన్నారు.
పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసేటప్పుడు కూడా పట్టించుకోకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు. ‘‘మా ఫిర్యాదులు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వైరల్ అయినప్పటికీ, పోలీసులు మాత్రం మా ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో మాకు ఎటువంటి న్యాయం జరుగుతుందో తెలియడం లేదు’’ అని అన్నారు.
ప్రజలే తన అసలు బలం
తాను ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటానని, వారి సేవ చేయడమే తన ధ్యేయమని ఫిరోజ్ ఖాన్ అన్నారు. ‘‘నా మీద దాడులు జరగడం వాస్తవం, కానీ ఇవి వ్యక్తిగతంగా నా మీద కాదు, కాంగ్రెస్ మీదే. నేను ప్రజల మధ్యనే ఉంటూ, వారి సమస్యలకు పరిష్కారాలు చూపిస్తా. న్యాయం మాత్రమే నా లక్ష్యం. కానీ ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోవడం విచారకరం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
రూలింగ్ పార్టీపై విమర్శలు – కేసుల ఉపసంహరణ డిమాండ్
తనపై జరిగిన దాడులు కాంగ్రెస్ పార్టీపై చేసిన దాడులా భావించాలని, ఈ ఘటనపై రూలింగ్ పార్టీ తక్షణం చర్యలు తీసుకోవాలని ఫిరోజ్ ఖాన్ డిమాండ్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం నా మీద తప్పుడు కేసులు నమోదు చేయడం తగదని, తక్షణమే ఆ కేసులను ఉపసంహరించి, నాకు దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతున్నా’’ అని చెప్పారు. పోలీసుల లాఠీచార్జ్‌లో మహిళలపై దాడులు జరిగిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
MIM భయం – కాంగ్రెస్ వెనుకడుగు?
కాంగ్రెస్ పార్టీ MIM పార్టీతో భయపడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ, ‘‘కాంగ్రెస్ నిజంగా MIM ముందు వెనుకడుగు వేస్తోందా? పార్టీ తన మద్దతుదారులను సపోర్ట్ చేయడానికి భయపడుతోందా? ఇది అందరికీ అర్థమయ్యేలా చేయాలి’’ అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి
చంద్రబాబుకు ఈడీ బిగ్ షాక్ – AP స్కిల్ డెవలప్మెంట్ స్కాం