ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉన్నత ఉద్యోగులకు గెజిటెడ్ హోదా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందాన్ని కలిగిస్తుంది.
పూర్వం జగన్ గారు చేసిన మంచి పని
గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు RTC ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించి ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు తీసుకురావడం విశేషం.
అయితే, ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి, ప్రభుత్వంలో భాగం అవ్వలేదు కాబట్టి ఉన్నత ఉద్యోగులకు గెజిటెడ్ హోదా ఇవ్వలేదు, ఇది కొంతమంది అధికారుల్లో అసంతృప్తిని కలిగించింది.
చంద్రబాబు కీలక నిర్ణయం
ఈ అసంతృప్తిని తొలగించేందుకు చంద్రబాబు గారు ఇప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ లో ఉన్న ఉన్నత స్థాయి క్యాడర్ అధికారులకు గెజిటెడ్ హోదా కల్పించారు. గెజిటెడ్ హోదా అనేది ప్రభుత్వ రంగంలో కీలకమైన గుర్తింపు.
ఉన్నత హోదాతో RTC కి మరింత బలం
గెజిటెడ్ హోదా పొందిన ఆర్టీసీ ఉన్నత స్థాయి అధికారులు ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ హోదా వారికి మరింత సౌకర్యాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తుందని, తద్వారా ఆర్టీసీ సంస్థకు కూడా మరింత బలాన్ని తీసుకొస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఏపీ డిప్యూటీ సీఎం టీమ్ లోకి ఆమ్రపాలి
చంద్రబాబుకు NSG కమాండోల భద్రత కట్
చంద్రబాబుకు ఈడీ షాక్ – AP స్కిల్ డెవలప్మెంట్ స్కాం
1 thought on “ఆర్టీసీ ఉన్నత ఉద్యోగులకు చంద్రబాబు బంపర్ ఆఫర్ | Gazetted Status for RTC High Cader Employees”