మంగళగిరి: టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ కీలక నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై విచారణ కొనసాగుతోంది.
నిన్నమంగళగిరి రూరల్ పోలీసులు సజ్జలను ప్రశ్నించారు. కేసులో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు ఉండడంతో సజ్జలకు నిన్న నోటీసులు జారీ చేయడం జరిగింది. దీననుసరించి, సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నమంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు.
సజ్జలకు 38 ప్రశ్నలు: గుర్తు లేదన్న సమాధానాలు
మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడి కేసులో సజ్జలను ప్రశ్నించామని తెలిపారు. ముందుగా సిద్ధం చేసిన 38 ప్రశ్నలు అడిగామని, వాటికి సజ్జలు చాలా ప్రశ్నలకు “గుర్తు లేదు” అని సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.
ఫోన్ ఇవ్వలేదని సజ్జలపై ఆరోపణ
గత ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్న సజ్జలను, తమ ఆధారాలపై ప్రశ్నించామని సీఐ వెల్లడించారు. సజ్జల తమ ఫోన్ ఇవ్వలేదని, విచారణలో సహకరించలేదని సీఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సజ్జలు తాము అడిగిన ప్రశ్నలకు వ్యతిరేకంగా సమాధానాలు ఇచ్చారని, దాడి జరిగిన రోజున తాను అక్కడ లేనని చెప్పారు. అయినా కూడా సజ్జల పాత్రపై ఆధారాలు ఉన్నాయని సీఐ స్పష్టం చేశారు.
విచారణ చివరి దశలో
ఈ కేసు దర్యాప్తు మూడు నెలలుగా కొనసాగుతోందని, ఇప్పుడు చివరి దశకు చేరుకున్నట్టు సీఐ తెలిపారు. నిందితులపై కోర్టుల రక్షణ ఉన్నందున విచారణలో ఆలస్యం అవుతోందని, అయితే వారిని అరెస్ట్ చేసిన వెంటనే విచారణ పూర్తవుతుందని పేర్కొన్నారు. కేసు తాజాగా సీఐడీకి అప్పగించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే, దర్యాప్తు ఫైళ్లను సీఐడీకి అప్పగిస్తామని సీఐ వివరించారు.
ఇవి కూడా చదవండి
ఆర్టీసీ ఉన్నత ఉద్యోగులకు చంద్రబాబు బంపర్ ఆఫర్
చంద్రబాబుకు NSG కమాండోల భద్రత కట్
చంద్రబాబుకు ఈడీ షాక్ – ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం