విజయనగరంలో పవన్ కళ్యాణ్ పర్యటన | Deputy CM Pawan Kalyan Visits Gurla Village

WhatsApp Group Join Now

విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని గుర్ల గ్రామంలో డయేరియా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అక్కడి ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల రక్షణ కోసం శాశ్వతమైన మంచినీటి పథకాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

డయేరియా బాధితుల పరామర్శ

డయేరియాతో బాధపడుతున్న గ్రామస్థులను కలుసుకున్న పవన్, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మంచినీటి అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పవన్ గుర్తించారు. మంచి నీటి సరఫరా, నీటి శుద్ధి పై పూర్తి సమాచారం తీసుకున్నారు.

పంచాయతీ నీటి పథకంపై దృష్టి

రక్షిత మంచినీటి పథకం పంపింగ్ హౌస్ వద్ద పవన్ పరిశీలన జరిపారు. శుద్ధి ప్రక్రియను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డయేరియా వంటి వ్యాధుల నివారణకు శాశ్వత పథకం అవసరమని గుర్తించారు.

పవన్ పర్యటనలో హడావిడి

పవన్ పర్యటన ఒక పక్కా పరిశీలనతో సాగగా, మరోవైపు అభిమానుల హడావిడి, పోలీసుల ఓవర్ యాక్షన్ కూడా చోటు చేసుకుంది.

స్థానిక ఎమ్మెల్యేలు అయిన కళావెంకట్రావు, ఎస్.కోట ఎమ్మెల్యేలను పోలీసులు పక్కకు నెట్టేయడం పట్ల ఆగ్రహం వ్యక్తమైంది. జిల్లా పోలీసు యంత్రాంగం సెక్యూరిటీ పరంగా లోపాలు కలిగి ఉన్నట్టు స్పష్టం అయ్యింది.

నష్ట పరిహారం

గుర్ల గ్రామంలో మరణించిన ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా లక్ష రూపాయల పరిహారం అందజేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. ప్రభుత్వ నివేదిక రాగానే, ప్రభుత్వం తరఫున కూడా ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.

విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని గుర్ల గ్రామంలో డయేరియా ప్రభావంతో 8 మంది మరణించగా, 100 మందికి పైగా అతిసారంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

దేశంలోనే తొలిసారి కొత్త తరహా విద్యుత్ వాహనాలును విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం

ఒంగోలులో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్

2027 లో జమిలి ఎన్నికలు

వీడియో

Deputy CM Pawan kalyan Vizianagaram Tour

1 thought on “విజయనగరంలో పవన్ కళ్యాణ్ పర్యటన | Deputy CM Pawan Kalyan Visits Gurla Village”

Leave a Comment