ఆంధ్ర ప్రదేశ్: ఇసుక కొరతతో నిర్మాణ పనులు ఆగిపోకూడదు అంటూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇసుక లభ్యత పెంచేందుకు చట్టబద్ధమైన మార్గాలు అమలు చేయాలని, ఉచిత ఇసుక విధానాన్ని పటిష్ఠంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
చెక్‌పోస్టులు ఏర్పాటు – అక్రమ తవ్వకాలపై చెక్
ఇసుకను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మార్గాల్లో తరలిపోకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదులను స్వీకరించేందుకు నూతన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ట్రాక్టర్లకు అనుమతి – గ్రామీణ అవసరాల కోసం
ఇప్పటివరకు ఎడ్ల బండ్లకు మాత్రమే ఇసుక రవాణా అనుమతిస్తే, తాజా నిర్ణయంతో గ్రామీణ అవసరాల కోసం ట్రాక్టర్లను కూడా వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో ముందుగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
ఇసుక లభ్యత పెంపు – నిర్మాణ రంగానికి ఊతం
ఇసుక కొరతతో రాష్ట్రంలో నిర్మాణ పనులు నిలిచిపోకుండా ఉండేందుకు ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీనరేజి చార్జీలు రద్దు చేయడంతో ఈ కొత్త విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక లభ్యత పెంపు చేస్తామని రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
ఇవి కూడా చదవండి
విజయనగరంలో పవన్ కళ్యాణ్ పర్యటన
దేశంలోనే తొలిసారి కొత్త తరహా విద్యుత్ వాహనాలును విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం
ఒంగోలులో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్
3 thoughts on “ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం కీలక నిర్ణయం | AP Govt Key Decision on Free Sand Policy”