ధోని ఈ సంవత్సరం ఐపీఎల్ ఆడుతున్నాడా? | MS Dhoni Playing in IPL 2025

WhatsApp Group Join Now

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ ఏడాది కూడా ఐపీఎల్ లో అడుగుపెట్టబోతున్నట్టు తాజా సంకేతాలు అందించారు. ఐపీఎల్ సీజన్ 2024లో మరికొన్ని నెలల పాటు ఆటను ఆస్వాదించాలని ధోని భావిస్తున్నట్టు చెప్పాడు. అభిమానుల కోసం ధోని మరోసారి ఫిట్‌నెస్ పై శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది.

CSK మేనేజ్‌మెంట్ సమావేశంలో కీలక నిర్ణయం

అక్టోబర్ 29-30 తేదీల్లో జరిగే CSK మేనేజ్‌మెంట్ సమావేశానికి ధోని హాజరవనున్నారు. రిటెన్షన్ జాబితా సమర్పణకు అక్టోబర్ 31 వరకు గడువు ఉన్నందున, అదే సమావేశంలో ధోని తన భవిష్యత్తు పై స్పష్టత ఇవ్వనున్నారు.

చరిత్ర సృష్టించిన ధోని

ఐపీఎల్ మొదటి సీజన్ నుంచే చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ధోని, జట్టుకు ఐదు టైటిళ్లను అందించాడు. గత సీజన్‌లో కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించినప్పటికీ, ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. ఇక ఈసారి ధోని తిరిగి జట్టును ముందుకు నడిపిస్తాడా? అనే ప్రశ్న అందరి మనసులో ఉంది.

ప్రొఫెషనల్ క్రికెట్ పై ధోని మనసులో మాట

ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో ధోని మాట్లాడుతూ, ప్రొఫెషనల్ క్రికెట్ ఎంతో కఠినమైనదని, చిన్నతనంలో ఆటను ఎంజాయ్ చేసినంతగా వృత్తిపరంగా ఆస్వాదించడం కష్టమని అభిప్రాయపడ్డాడు. “క్రికెట్ ఒకప్పుడు సరదాగా ఆడితే, ఇప్పుడు అది పూర్తి సమర్పణ కావాలి,” అని ధోని చెప్పాడు.

మరో ఐపీఎల్ సీజన్ కోసం ధోని ప్రణాళిక

తన ఫిట్‌నెస్ పై మరింత శ్రద్ధ పెట్టి, ప్రతి ఏడాది రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడగలుగుతున్నానని ధోని తన లక్ష్యాన్ని పంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

కరెంటు చార్జీల పెంపును అడ్డుకుంటాం అంటున్న KTR

1000 కోట్ల భూ కుంభకోణానికి సహకరించిన మాజీ కలెక్టర్

వీడియో

MS Dhoni Playing in IPL 2025