ఆంధ్ర ప్రదేశ్, నవంబర్ 2 (తాజావార్త): ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.
గతంలో నిలిచిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రక్రియ ప్రారంభించింది. ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.
డిసెంబర్‌లో ఫిజికల్ టెస్ట్
డిసెంబర్ నెల చివరి వారంలో అభ్యర్థుల ఫిజికల్ టెస్ట్ నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల కోసం విడుదలైన నోటిఫికేషన్‌కు అనుసంధానంగా ఈ ప్రక్రియ జరుగుతోంది.
2023 జనవరిలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా పోస్టుల భర్తీ నిలిచిపోయింది. తాజా ప్రభుత్వ కూటమి అధికారంలోకి రావడంతో ఈ ప్రక్రియను మళ్లీ ప్రారంభించారు.
దరఖాస్తు విధానం
ఆసక్తి ఉన్న అభ్యర్థులు http://slrb.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఇవి కూడా చదవండి
అనంతపురం ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై కార్మికులకు అస్వస్థత
ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని పెంచుతున్న చంద్రబాబు