తెలంగాణ: వికారాబాద్ జిల్లాలో రైతులు, గ్రామస్థులు కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ స్థాపనపై అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్‌పై రాళ్లు, కర్రలతో దాడి జరిగింది. అధికారులు ప్రజల ఆగ్రహానికి గురై వాహనాలపై దాడి జరిగింది.
కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళ
కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై మహిళ ఒకరు చేయి చేసుకోవడం ఉద్రిక్తతను మరింత పెంచింది. ఇది చూసిన గ్రామస్థులు ఆగ్రహంతో రాళ్లు, కర్రలతో అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. మూడు వాహనాలు నాశనం కాగా, ఘటన స్థానంలో భారీగా పోలీసులు మోహరించారు.
డెవలప్మెంట్ అధికారిపై దాడి
కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్థులు దాడి జరిపారు. స్థానికుల ఆందోళనను ఎదుర్కోవడంలో అధికారులు విఫలమయ్యారు.
ఫార్మా కంపెనీ స్థాపనపై రైతుల అసహనం
లగచర్ల, దుద్యాల, పోలేపల్లి, తాండ గ్రామాల్లో ఫార్మా కంపెనీల స్థాపన ప్రతిపాదనపై రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కంపెనీల వల్ల పర్యావరణ నాశనం అవుతుందనే భయంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పోలీసు బలగాలు సంఘటన స్థలంలో మోహరించగా, పరిస్థితిని శాంతి పరచడానికి చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన టీడీపీ నేత
రైతులనుపై జులుం చేసేవారిని వదిలిపెట్టం – రేవంత్ రెడ్డి
వీడియో
కలెక్టర్ మీద చేసిన ప్రజలు
రాళ్ళు, కర్రలతో దాడి చేసిన రైతులు, గ్రామస్థులు
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై చేయి చేసుకున్న మహిళ
కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్థుల దాడి
దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఉద్రిక్తత.
ఫార్మా కంపెనీ… pic.twitter.com/Ri8DcnWG78
— Sarita Avula (@SaritaAvula) November 11, 2024
1 thought on “కొడంగల్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత | Villagers Attacks Vikarabad Collector Prateek Jain”