కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర పాఠశాలలో హాస్టల్ విద్యార్థులు అన్నం నాణ్యతపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా హాస్టల్లో అందిస్తున్న భోజనం నాసిరకం ఉందని విద్యార్థులు చెబుతున్నారు. అన్నం వాసన వస్తున్నట్టు, ముద్దలుగా ఉండి తినడానికి ఇబ్బంది కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తల్లిదండ్రులతో కలిసి ఆందోళన
అన్నం నిలకడగా లేకపోవడంతో కడుపునొప్పులు, అస్వస్థతలు ఎదురవుతున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. మంగళవారం తమ తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగిన విద్యార్థులు, హాస్టల్ భోజనం నాణ్యతలో మార్పు రావాలని డిమాండ్ చేశారు.
ఆస్పత్రి పాలవుతున్న విద్యార్థులు
అన్నం తినడం వల్ల కడుపునొప్పులతో ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టల్ అధికారులు ఈ సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, సంబంధిత అధికారులకూ ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
వారం రోజులుగా తిండిలేక క్షీణిస్తున్న విద్యార్థులు
ఆరోగ్యకరమైన భోజనం అందక విద్యార్థులు నీరసంగా మారిపోయారని, వారంరోజులుగా సరైన తిండి లేక అనారోగ్యానికి గురవుతున్నామని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ భోజన నాణ్యతను మెరుగుపరచాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
కలెక్టర్ పై దాడిని రాజకీయం చేస్తున్న ప్రభుత్వం
రైతులను ఇబ్బందిపెట్టే దళారీలను కఠినంగా శిక్షిస్తా – రేవంత్ రెడ్డి
1 thought on “భోజనం వల్ల కడుపు నొప్పితో బాధ పడుతున్న హాస్టల్ విద్యార్థులు | Students Suffer Stomach Pain Due to Hostel Food”