52 కోట్లకు అమ్ముడుపోయిన అరటి పండు | 52 Crore Banana Story

WhatsApp Group Join Now

రోజు మనం అరటిపండ్లు కొనుగోలు చేయడానికి 5 లేదా 10 రూపాయలు ఖర్చు చేస్తాం. కానీ ఒక అరటిపండు కోసం అక్షరాల 52 కోట్లు ఖర్చు చేశాడో వ్యక్తి. ఇది విన్నప్పుడు షాక్ అవ్వడం సహజం! మరి ఇది ఏదైనా ప్రత్యేక పండు? బంగారం లేదా వజ్రాలతో కూడినదా? కాదు, ఇది సాదాసీదా అరటిపండే!

ఏమిటి ఈ 52 కోట్ల కథ?

ఇటలీకి చెందిన కళాకారుడు మౌరిజియో కటెలాన్ ఈ అరటిపండును టేప్‌తో గోడకు అతికించి “కమెడియన్” అనే పేరుతో కళాఖండంగా మార్చాడు. ఈ ప్రత్యేకమైన ఆర్ట్ పీస్‌ను సోత్బీస్ వేలం సంస్థ ద్వారా చైనా వ్యాపారవేత్త జస్టిన్ సన్ అక్షరాల 6 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. అందుకే ఈ అరటిపండు విలువ 52 కోట్ల రూపాయలు!

కళా దృష్టి ప్రత్యేకత

మామూలు కంటికి ఇది ఓ అరటిపండు మాత్రమే. కానీ కళాభిమానులు, కళాకారులు దీన్ని ఒక ప్రతీకగా చూస్తారు. ఈ పండు క్రిప్టో కరెన్సీకి సింబాలిక్ అట. దీని ప్రత్యేకత గురించి సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

నెట్‌లో మీమ్స్ హోరెత్తిస్తున్న అరటిపండు

ఇదే కాదు, 2019లో ఇదే పండు మొదటిసారి వేలంలో 98 లక్షలు పలికింది. తర్వాతి రోజుల్లో ఈ కళాఖండం ఖరీదు పెరిగిపోతూ వచ్చింది. ప్రతి మూడు రోజులకు కొత్త పండును టేప్ చేస్తూ గోడపై ఉంచడం జరుగుతుంది. ఇది పబ్లిక్‌కు పిచ్చిపనిగా కనిపించినా, కళా ప్రపంచంలో గొప్ప దృక్పథంగా తీసుకుంటున్నారు.

మీ అభిప్రాయం?

ఈ అరటిపండు కథ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో పంచుకోండి. సోషల్ మీడియాలో ఈ వార్తను షేర్ చేసి మీ స్నేహితులతో ఆలోచనల్ని చర్చించండి!

ఇవి కూడా చదవండి

ఆంబులెన్స్ కు దారి ఇవ్వని కార్ యజమానికి భారీ జరిమానా

మన దేశంలో త్వరలో రానున్న నీటితో నడిచే రైలు

వీడియో