కన్ను బాగుచెయ్యమంటే ప్రాణం తీసేసిన వైద్యులు | Doctors Took Baby Life Instead of Treating Her Eye

WhatsApp Group Join Now

హైదరాబాద్ (తాజావార్త): హైదరాబాద్ హబ్సిగూడాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆరేళ్ల హన్విక ప్రాణాలు కోల్పోయింది. కంటి గాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన పాప, మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన ఆనంద్ కంటి ఆసుపత్రిలో జరిగింది.

ఘటన వివరాలు

తొరూరికి చెందిన రవి, మౌనిక దంపతుల కుమార్తె హన్విక ఇంటి ముందు ఆడుకుంటుండగా కర్ర ముక్క కంట్లో గుచ్చుకుంది. కుటుంబ సభ్యులు హుటాహుటిన చందానగర్ లోని
ఆనంద్ఐ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ కంటి చుక్కలు ఇచ్చి ఇంటికి పంపిన వైద్యులు, తర్వాత హబ్సిగూడా బ్రాంచ్ కు తీసుకురావాలని సూచించారు.

మత్తుమందు మోతాదు పెరిగి

హబ్సిగూడా ఆసుపత్రిలో చిన్నారికి మత్తుమందు ఇచ్చారు. కానీ, అది మోతాదుకు మించి ఉండటంతో హన్విక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

పరిస్థితి విషమించడంతో రహస్యంగా ఎల్బీ నగర్ లోని రెయిన్బో హాస్పిటల్ కి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని అక్కడి వైద్యులు నిర్ధారించారు.

ఆందోళన, కన్నీటి విలాపం

వైద్యులు ఈ విషయం కుటుంబానికి చెప్పకుండా దాచిపెట్టారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమ పాప వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని రవి, మౌనిక దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

మీ అభిప్రాయం

ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని తాజా వార్తల కోసం షేర్ చేయడం మరచిపోకండి!

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్ అక్రమ రెంటు దందా వెలుగులోకి

52 కోట్లకు అమ్ముడుపోయిన అరటి పండు

వీడియో

Leave a Comment