హైదరాబాద్: హైదరాబాద్ నగరం ఇప్పుడు ఢిల్లీ స్థాయి గాలి కాలుష్యంతో పోటీ పడుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఒక్కసారిగా 300 పాయింట్లను దాటడంతో నగరంలోని కూకట్ పల్లి, మూసాపేట, బాలానగర్, నాంపల్లి మరియు మెహదీపట్నం ప్రాంతాల్లో గాలి నాణ్యత ఆందోళనకరంగా మారింది.
ఆరోగ్యానికి ముప్పు!
ఈ కాలుష్య పరిస్థితి చిన్న పిల్లలు, వృద్ధులు మరియు శ్వాసకోశ సమస్యలు ఉన్న వారికి తీవ్రమైన ముప్పుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు: ఈ స్థితి మరింత కఠినతరం అయితే, నగరం త్వరలోనే ఢిల్లీతో సమానమైన కాలుష్య స్థాయికి చేరుకుంటుందని.
కాలుష్యం పెరగడానికి కారణాలు
నగరంలో అధిక వాహన దట్టత, అనుమతి లేని పరిశ్రమలు, ఫిట్నెస్ లేని వాహనాలు ప్రధాన కారణాలు. పొల్యూషన్ చెక్ లేమి, అనుమతి లేకుండా కెమికల్ ఫ్యాక్టరీలు పనిచేయడం వంటి అంశాలు పరిస్థితిని మరింత అధ్వాన్నంగా మారుస్తున్నాయి.
తక్షణ చర్యలు అవసరం
ప్రభుత్వం, GHMC, HMDA లు కాలుష్య నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాహనాల ఫిట్నెస్ టెస్టులు కచ్చితంగా నిర్వహించి, పొల్యూషన్ చేకు పాయింట్లను పెంచడం అవసరం.
నిమోనియా కేసుల వృద్ధి
పెరుగుతున్న కాలుష్యం వలన రోజుకు 80-100 పిల్లలు నిమోనియా లక్షణాలతో ఇబ్బంది పడుతూ నీలోఫెర్ హాస్పిటల్ లో అడ్మిట్ అవుతున్నారు.
ప్రజలకు సూచనలు
పౌరులు అవసరమైతేనే బయటికి వెళ్లాలని, చిన్నారులు, వృద్ధులు గాలి కాలుష్యానికి ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి. దయచేసి ఇతరులకు ఈ న్యూస్ షేర్ చెయ్యండి.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ అక్రమ రెంటు దందా వెలుగులోకి
52 కోట్లకు అమ్ముడుపోయిన అరటి పండు
3 thoughts on “హైదరాబాద్ గాలి కాలుష్యం ఢిల్లీ స్థాయికి చేరువ | Hyderabad Air Pollution Nears Delhi Levels”