కూటమి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పొందడానికి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVRS) సిస్టంను వినియోగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా పథకాలలో మార్పులు చేయాలని నిర్ణయించారు.
పెన్షన్ పథకం పై ప్రత్యేక దృష్టి
ఇంటింటికి పెన్షన్లు అందుతున్నాయా? దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీపై ఇబ్బందులెవరైనా ఎదుర్కొంటున్నారా? వంటి ప్రశ్నల ద్వారా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది.
నూతన పాలసీలపై ప్రజల స్పందన
సర్కారు తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం, మద్యం పాలసీ వంటి కొత్త పథకాలపై కూడా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఈ అభిప్రాయాలు, భవిష్యత్తు నిర్ణయాలకు కీలకంగా ఉంటాయని అధికారులు తెలిపారు.
జనాభిప్రాయంతో భవిష్యత్తు నిర్ణయాలు
ప్రజలు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా, కొత్త పథకాలు, నూతన మార్పులు ప్రభుత్వం చేపట్టనుంది. ఈ విధానం ద్వారా ప్రజల నెగెటివ్ కామెంట్స్‌ను తగ్గించి, వైసీపీకి వచ్చిన చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడుతోంది కూటమి ప్రభుత్వం.
ఈ నూతన విధానంపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మా WhatsApp ఛానల్ ద్వారా మరింత సమాచారం పొందండి.
ఇవి కూడా చదవండి
ఆంధ్ర వక్ఫ్ బోర్డ్ రద్దు వెనుక నిజాలు ఏమిటి?
“రా ఎన్టీఆర్” పేరుతో పేదలకు ఉచిత భోజనం అందిచబోతున్న అభిమానులు