ఏపీ ప్రభుత్వం 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగం | AP Government Implements ESMA on 104 Employees

WhatsApp Group Join Now

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇన్ని రోజులైనా కార్మికులను పట్టించుకోకపోవడంతో వాలంటీర్లు, ఆశావర్కర్లు, 104 ఉద్యోగులు ఇలాంటి అన్ని రకాల కార్మికులు నిరసనలు చేపడుతున్నారు.

ప్రస్తుతం 104 ఉద్యోగుల నిరసనలు ప్రభుత్వ చర్యలకు దారితీశాయి. రాష్ట్ర ప్రభుత్వం 104 ఉద్యోగులపై ఎస్మా (ESMA) ప్రయోగం చేసింది అందువలన ఈ సమస్య మరింత పెద్దదిగా మారింది.

తమ సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో గతంలోనే 104 ఎంప్లాయిస్ యూనియన్ సమ్మె నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 26 నుండి ఎప్పుడైనా సమ్మె చేయనున్నట్లు ప్రకటించిన ఉద్యోగులు, రేపు 36 గంటల నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

ఎస్మా అంటే ఏమిటి?

ఎస్మా అంటే అత్యవసర సేవల నిర్వహణ చట్టం. ఈ చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు, నిరసనల ద్వారా అత్యవసర సేవలను ప్రభావితం చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం వారికి నోటీసులు జారీ చేసి, క్రమశిక్షణ తప్పని పక్షంలో చర్యలు తీసుకోవచ్చు.

ఉద్యోగుల ఆగ్రహం

ఈ నిర్ణయంపై 104 ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ఇది సరైన చర్య కాదు, సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకోవడం దురదృష్టకరం,” అంటూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు, ప్రభుత్వం మాత్రం సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు అవసరమైన సహకారం ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.

దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వార్త నచ్చితే ఇతరులతో షేర్ చెయ్యండి.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ పేరుతో పేదలకు ఉచిత భోజనం అందిచబోతున్న అభిమానులు

ప్రాణహాని తలపెట్టేలా జనసేన కార్యకర్తల పోస్టులు

వీడియో

Leave a Comment