6 లక్షల పించన్లు రద్దు చేయనున్న ప్రభుత్వం | Government Plans to Cancel 6 Lakh Pensions

WhatsApp Group Join Now

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా పొందిన పించన్లను తొలగించేందుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ విషయంపై కీలక చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పించన్ల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఫేక్ సర్టిఫికెట్లు: పించన్ల రద్దు

కడప జిల్లాలో 3700 అనుమానాస్పద కేసులు పరిశీలించగా, దాదాపు 90% ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నట్లు తేలిందని కలెక్టర్లు తెలిపారు. తక్షణమే ఆ పించన్లను నిలిపివేయడం కాకుండా, నకిలీ సర్టిఫికెట్లు అందించిన వారిపై కేసులు నమోదు చేసి, రెవెన్యూ రికవరీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

చంద్రబాబు ఆగ్రహం

“రెవెన్యూ రికవరీతోపాటు, నకిలీ సర్టిఫికెట్లు అందించిన వైద్యులపై కూడా చర్యలు తీసుకోవాలి. భయానికి లోనయ్యేలా డాక్టర్లను ప్రాసిక్యూట్ చేయండి” అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

పింఛన్ వెరిఫికేషన్ తాత్కాలికంగా ముగింపు

రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలలలోపే మొత్తం పింఛన్ వెరిఫికేషన్ పూర్తిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రారంభమైన రీవెరిఫికేషన్ ద్వారా అనేక నకిలీ పించన్ కేసులు బయటపడ్డాయి.

తదుపరి చర్యలు ఏమిటి?

నకిలీ సర్టిఫికెట్లతో పించన్లు పొందిన వారు, నకిలీ సర్టిఫికెట్లు అందించిన వైద్యులు ఆగస్టు మండలి చర్యలకు గురయ్యే అవకాశముంది. చంద్రబాబు ప్రతిపాదనలు పూర్తిగా అమలు చేయబడితే, రాష్ట్రం మొత్తంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పవచ్చు.

ఈ చర్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. మీకు ఇష్టమైన వ్యక్తులతో ఈ వార్తను పంచుకోండి.

ఇవి కూడా చదవండి

కూతురుని వేధించినందుకు కువైట్ నుండి వచ్చి చంపేసిన తండ్రి

ఏపీలో ఇకనుండి ట్రాఫిక్ చలానా కట్టకపోతే కరెంటు నీళ్లు కట్ ఆ?

వీడియో

Leave a Comment