తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న ఆయన, ఈ అంశంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒక మహిళ మరణించిందని, ఆమె కొడుకు జీవితంపై పోరాటం చేస్తున్నాడని ప్రస్తావిస్తూ, అల్లు అర్జున్ చట్టపరమైన చర్యలపై తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు.
అల్లు అర్జున్ పై ఘాటైన వ్యాఖ్యలు
“అల్లు అర్జున్ ఏం భారత్-పాకిస్తాన్ సరిహద్దులో పోరాడి దేశాన్ని గెలిపించాడా?” అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “అతను హీరో అయితే సినిమాలకే పరిమితం కావాలి, కానీ ర్యాలీలు నిర్వహించడం ఎందుకు? సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ అరెస్ట్ అవ్వడం చట్టపరంగా జరిగింది. చట్టం ముందు అందరూ సమానమే” అని వ్యాఖ్యానించారు.
మహిళ మరణం, మీడియా చర్చపై విమర్శ
ఒక మహిళ చనిపోయిన ఘటనలో, ఆమె కుటుంబం, కొడుకు పరిస్థితి గురించి మీడియా ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై జరుగుతున్న చర్చకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, చట్టం తన పని తాను చేసుకుందని తెలిపారు.
రేవంత్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం
తన అభిమాన హీరో కృష్ణ అని, ప్రస్తుతం ఆయన లేరని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. “నేనెవరికీ అభిమాని కాదు. నేను స్వతహాగా పెద్ద స్టార్” అంటూ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇలాగైతే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చెయ్యాలి – KTR
అల్లు అర్జున్ వలన ఒక మహిళ మృతి చెందిందని ఆయనను అరెస్ట్ చేస్తే హైడ్రా వలన ముగ్గరు చనిపోయారు. ఈ లెక్కన రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైల్లో వెయ్యాలని కేటీఆర్ గారు అన్నారు.
ఈ వ్యవహారం పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వార్త ఆసక్తికరంగా అనిపిస్తే, షేర్ చేసి మద్దతు ఇవ్వండి!
ఇవి కూడా చదవండి
ఏపీలో ఇకనుండి ట్రాఫిక్ చలానా కట్టకపోతే కరెంటు నీళ్లు కట్ ఆ?
అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందా?