హైద్రాబాద్ ప్రజలను మరో కొత్త వైరస్ భయపెడుతుంది. అదే నోరోవైరస్ దీనినే వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా అంటారు.
రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో కేసులు నమోదు అవడం హైదరాబాద్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.
GHMC అధికారులు అప్రమత్తమై జనాలకు సూచనలు ఇస్తున్నారు. ఇది అంటువ్యాధి అని వేగంగా వ్యాపిస్తుందని జాగ్రత్త చర్యలు తీసుకుంటే నివారించుకోవచ్చని చెప్తున్నారు.

కరోనా పోయింది అని ప్రశాంత జీవనం సాగిస్తుంటే ఇది ఒకటి వచ్చింది మళ్ళి. ఇది చాల వేగంగా వ్యాపిస్తుంది.
ఈ వైరస్ కారణంగా కేవలం పాతబస్తీ ప్రాంతంలోనే రోజుకి 100-120 కేసులు నమోదవుతున్నాయి.
కారణాలు
నోరో వైరస్ సోకడానికి కలుషిత నీరే ప్రధాన కారణంగా చెప్తున్నారు. మరియు నాణ్యతలేని ఆహారం కూడా కారణమని చెప్తున్నారు.
ప్రస్తుతం ఈ నోరోవైరస్ కేసులు హైద్రాబాద్ లోని యాకత్ పురా, మలక్ పేట్,డబీర్ పురా, పురాని హవేలీ,మొఘల్ పురా లాంటి పలు ప్రాంతాలలో ఎక్కువగా నమోదు అవుతున్నట్లు తెలుస్తుంది.

కనిపించే లక్షణాలు
ఈ వైరస్ సోకినా వారికి వాంతులు, విరోచనాలతో పాటు శరీరం Dehydration అవుతుంది. వైరస్ సోకినా వ్యక్తిలో 48 గంటల్లోనే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ వలన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, కౌమార దశలో ఉన్న బాలికలలో తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్ లను కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
శరీరం వేగంగా డీ హైడ్రేషన్ అవ్వడంతో మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది. అంటూ వ్యాధి కావడంతో ఒకరి నుండి మరొకరికి సులువుగా వ్యాపిస్తుంది.
ఈ వైరస్ సోకిన వ్యక్తులు 2 లేదా 3 రోజులల్లో కోలుకుంటున్నారని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తీ తక్కువగా ఉన్నవారికి 2,3 వారాలు పడుతుంది తగ్గడానికి.
చికిత్స
నోరోవైరస్ కి ఎటువంటి టీకా (vaccine) ఇంకా తయారు చెయ్యలేదు. వైద్యులు ఇచ్చిన మందులు వాడితే 2,3 రోజుల్లో కోలుకోవచ్చు.
జాగ్రత్తలు
నోరోవైరస్ సోకకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
1. తరచుగా సబ్బుతో చేతుల్ని కడుగుకోవాలి
2. వేడి నీళ్లను తాగాలి
3. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
4. వేడి వేడి మరియు మంచి ఆహారాన్ని తీసుకోవాలి
5. వైరస్ సోకిన వ్యక్తి బట్టలను వేడి నీటిలో ఉతకాలి.
6. వైరస్ సోకిన వ్యక్తి కి తగ్గేంత వరకు దూరంగా ఉండాలి.