విమానంలో టేకాఫ్ అనంతర సాంకేతిక లోపం
ఎయిర్ ఇండియా విమానంలో షార్జా వెళ్తున్న ప్రయాణికులు అనుకోని సంఘటనను ఎదుర్కొన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. పైలట్ హైడ్రాలిక్ సిస్టంలో లోపం ఉన్నట్లు గుర్తించాడు, వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కృషి చేశాడు.
రెండున్నర గంటల గాలిలో విహారం
ఈ సాంకేతిక సమస్య వల్ల విమానం రెండున్నర గంటల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ప్రయాణికులు ఎంతో ఉత్కంఠతో ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరిస్తూ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి సిద్ధం కావడంతో చివరికి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య.. రెండున్నర గంటలుగా గాలిలోనే చక్కర్లు కొట్టిన విమానం
ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రకటించిన పైలట్..
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య.
హైడ్రాలిక్ సిస్టంలో లోపం గుర్తించి ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్.
ఎట్టకేలకు సేఫ్ ల్యాండింగ్… pic.twitter.com/06KA9NUwK2
— Telugu Scribe (@TeluguScribe) October 11, 2024
తిరుచ్చి ఎయిర్‌పోర్టులో సురక్షిత ల్యాండింగ్
తిరుచ్చి ఎయిర్పోర్ట్ అధికారుల అనుమతి తీసుకున్న పైలట్ ఎట్టకేలకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాడు. విమానంలో ఉన్న 141 మంది ప్రయాణికులెవరూ గాయపడకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత ప్రయాణికులు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
దిగిన తర్వాత ప్రయాణికులు ఉద్వేగానికి లోనయ్యారు. పైలట్ కి చప్పట్లు కొడుతూ తమ అభిమానాన్ని తెలియజేసారు.
ఇది కూడా చదవండి
ఐసీఐసీఐ బ్యాంక్ 100 కోట్ల స్కామ్‌పై సీఐడీ దర్యాప్తు