జగన్ ఢిల్లీ ధర్నా
జగన్ ఢిల్లీ ధర్నా కు మద్దతుగా సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ గారు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటోలను అలాగే వైస్సార్సీపీ కార్యకర్తలపై జరిగిన దాడుల వీడియోలను చూసారు.
తదుపరి ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను జగన్ గారిని తనను ఈ ధర్నాకు పిలిచినందుకు అభినందింస్తున్నాను. ఈ ధర్నాకు రాకపోతే నేను నిజాన్ని తెలుసుకోకపోతాను అన్నారు. రాజకీయాలలో ఒక నాయకుడు ఒకసారి గెలుస్తాడు ఒక్కక్కసారి ఓడిపోతాడు.
నేను ఈ వీడియోస్ చూసి ఒకటే చెప్తున్నాను అదేంటంటే అధికారంలో ఉన్న వారు సమాధానంగా ఉండాలి. ప్రతిపక్షం చెప్పేది ఒకసారి వినాలి. అంతేకాని ప్రజలను చంపకూడదు.

ఈ ఫోటోలు వీడియోలను చూస్తుంటే వారు అధికారంలో వచ్చినప్పటినుండి ప్రతిపక్షం కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. ప్రాణాలు తీయడం. నడిరోడ్లపై దొమ్మీ చెయ్యడం, ప్రజలకు నష్టం చేకూర్చడం, వాళ్ళమీద తప్పుడు కేసులు పెట్టడం చేస్తున్నారు. ఎమ్మెల్యేల మీద సైతం దాడికి దిగుతున్నారు. ఇది మంచి ప్రజాస్వామ్యం అనిపించుకోదు అని అన్నారు.
ఈరోజు మీరు ముఖ్యమంత్రి ఉన్నారు రేపు జగన్ ముఖ్యమంత్రి అవ్వొచ్చు. బుల్డోజర్ సంస్కృతి మంచిది కాదు అని కూడా చెప్పారు.
జనాల్ని చంపినోడు బెదిరించినోడు మంచి నాయకుడు కాలేదు అని అన్నారు. జనాల్ని భయపెట్టేవాళ్ళు ఎక్కువకాలం అధికారంలో ఉండరు అని కూడా అఖిలేష్ గారు చెప్పారు.
జగన్ మరియు వారి పార్టీ నాయకులను నేను అభినందిస్తున్నాను వారు ధైర్యం కోల్పోకుండా ఇలా ధర్నా చేస్తున్నారు ప్రజలకోసం అని చెప్పారు. కార్యకర్తల కోసం ఇంతలా పాటు పడుతున్న జగన్ ఖచ్చితంగా వచ్చేసారి గెలుస్తాడని, కార్యకర్తలు ఖచ్చితంగా జగన్ ని గెలిపించుకుంటారని చెప్పారు.\