కొండా సురేఖపై 100 కోట్ల పరువు నష్టం కేసు వేసిన నాగార్జున | Akkineni Nagarjuna vs Konda Surekha Case

WhatsApp Group Join Now

హీరో అక్కినేని నాగార్జున గారు తెలంగాణ మంత్రి కొండా సురేఖపై 100 కోట్ల రూపాయల  పరువునష్టం కేసు పెట్టారు. ఈ కేసు పెట్టడానికి కారణం, మంత్రి సురేఖ నాగ చైతన్య మరియు సమంత విడాకులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు. ఆమె కేటీఆర్‌తో సాంఘిక సంబంధాలను ఈ విడాకులకి అనుసంధానం చేస్తూ, అక్కినేని కుటుంబాన్ని దూషించినట్లు ఆరోపించారు​.

ఈ కేసు 10వ తేదీ విచారణకు వాయిదా పడింది. ఈ రోజు నాంపల్లి కోర్టులో నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. “కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నా కుటుంబ పరువును కించపరచాయి” అంటూ నాగార్జున కోర్టులో చెప్పారు.

Akkineni Nagarjuna vs Konda Surekha Case
కొండా సురేఖపై 100 కోట్ల పరువు నష్టం కేసు వేసిన నాగార్జున

సుప్రియ, అమల కూడా కోర్టులో హాజరు

నాగార్జున తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సుప్రియ, అమల కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. సుప్రియ కూడా “కొండా సురేఖ చేసిన ఆరోపణలు మా కుటుంబం పరువుని దెబ్బతీశాయి” అంటూ కోర్టులో తన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

10వ తేదీకి కీలక విచారణ

కొండా సురేఖకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. నాగార్జున కోర్టులో తన సాక్ష్యాలు ఇవ్వగా, సురేఖ తరపున ఇచ్చిన డిఫెమేటరీ స్టేట్మెంట్ పై విచారణ జరగనుంది. ఆ రోజున నాగార్జున తరపున పూర్తి వాదనలు వినిపించనున్నారు.

పరువునష్టం కేసులో మరిన్ని మలుపులు

కేసు విచారణ వాయిదా పడినప్పటికీ, నాగార్జున ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. “డిఫర్మేషన్ కేసు ద్వారా కొండా సురేఖకు తగిన శిక్ష పడాలంటూ” ఆయన కోర్టును కోరారు. 10వ తేదీ విచారణ తర్వాత న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి

జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు రద్దు

నాగార్జునపై కక్షగట్టిన రేవంత్ సర్కారు

వీడియో

New Twist in In Nagarjuna Konda Surekha Case

2 thoughts on “కొండా సురేఖపై 100 కోట్ల పరువు నష్టం కేసు వేసిన నాగార్జున | Akkineni Nagarjuna vs Konda Surekha Case”

Leave a Comment