టీడీపీ సోషల్‌ మీడియాపై అంబటి రాంబాబు ఫిర్యాదు | Ambati Rambabu Complains on TDP Social-Media

WhatsApp Group Join Now

ఆంధ్రప్రదేశ్: టీడీపీ సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత పోస్టులు వస్తున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఆగ్రహించారు. ఆయన గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మార్ఫింగ్ ఫోటోలు వివాదానికి కేంద్రం

అంబటి మాట్లాడుతూ, “జగన్ మోహన్ రెడ్డి గారి మార్ఫింగ్ ఫోటోలను టీడీపీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టి ఆయనను అవమానిస్తున్నారు. ఇది నైతికంగా, చట్టపరంగా తప్పు,” అని అన్నారు.

రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ ఫోటోలు పెట్టారని ఆయనను అరెస్ట్ చేసారు, ఇప్పుడు మీరు చేస్తుంది ఏమిటి అని ప్రశ్నించారు.

తక్షణ చర్యలు లేకపోతే కోర్టుకు వెళ్తాం

మార్ఫింగ్ ఫోటోలు మరియు అనుచిత వ్యాఖ్యలు ప్రోత్సహించడం ప్రమాదకరమని పేర్కొంటూ, “ఇలాంటి చర్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేనిచో చట్టపరంగా ముందుకు వెళ్తామని పోలీసులు ముందస్తుగా హెచ్చరిస్తున్నాం,” అని అంబటి స్పష్టం చేశారు.

వైసీపీపై కూడా విమర్శలు

తాను ముందు వైసీపీ సోషల్ మీడియా చేసిన తప్పులను కూడా ప్రస్తావించినట్లు గుర్తుచేసిన అంబటి, “అప్పట్లో చేసిన ట్వీట్లు కూడా తప్పే. కానీ ప్రస్తుతం టీడీపీ అధికారికంగా ఈ విధమైన పోస్టులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది,” అని అన్నారు.

మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. ఈ కథనాన్ని మీ స్నేహితులతో పంచుకుని చర్చకు వేదిక చేయండి.

ఇవి కూడా చదవండి


రైతులు, విద్యార్థుల మేలు కోసం రాష్ట్రమంతా వైస్సార్సీపీ పోరుబాట

ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ అందక ఇక్కట్లు పడిన నిరుపేద తండ్రి

వీడియో

Leave a Comment