ఆంబులెన్స్ కు దారి ఇవ్వని కార్ యజమానికి భారీ జరిమానా | Ambulance Blocker Fined Heavily in Kerala

WhatsApp Group Join Now

కేరళలో జరిగిన ఈ ఘటన మానవత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అత్యవసరంగా వెళ్తున్న ఆంబులెన్స్ కు ఒక కారు యజమాని ఉద్దేశపూర్వకంగా దారి ఇవ్వలేదు.

ఆ సమయంలో సైరన్ మరియు హారన్ మ్రోగించినా, ఆ కారు డ్రైవర్ స్పందించకుండా ముందుకే సాగాడు. దీనితో ఆంబులెన్స్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వైరల్ వీడియోపై పోలీసులు స్పందన


ఆ ఘటనను ఆంబులెన్స్ సిబ్బంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వెంటనే పోలీసులు చర్యలు చేపట్టి, కారు యజమానిని గుర్తించారు.

అతని ఇంటికి వెళ్లి ₹2 లక్షల జరిమానా విధించి, అతని డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేశారు. ఈ చర్య కేరళలో చర్చనీయాంశమైంది.


వాహన చట్టం ప్రకారం


మోటార్ వాహనాల నిబంధనల ప్రకారం, అత్యవసర సేవల వాహనాలకు దారి ఇవ్వడం ప్రతి వాహనదారుడి బాధ్యత. దీన్ని ఉల్లంఘిస్తే కనీసం ₹10,000 జరిమానా విధిస్తారు. అదే తప్పు మళ్లీ చేస్తే ₹25,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేసే అధికారం పోలీసులకు ఉంది. ఈ కేసులో
పోలీసులు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని మొదటి ఉల్లంఘనకే భారీ జరిమానా విధించారు.


మార్గం ఇవ్వడం మానవత్వం


అత్యవసర పరిస్థితుల్లో వాహనదారులు మార్గం ఇచ్చి మానవత్వాన్ని చాటుకోవాలి. చట్టాల పట్ల గౌరవంతో పాటు, ప్రాణాలు కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి వాహనదారుడికి ఇది గుణపాఠం కావాలని పోలీసులు సూచిస్తున్నారు.

దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ ఆర్టికల్ ను మీ స్నేహితులకు షేర్ చెయ్యండి.

ఇవి కూడా చదవండి

మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస

భారత దేశంలో త్వరలో రానున్న నీటితో నడిచే రైలు

వీడియో