ఉద్యోగ భద్రత కావాలని పోరాటం చేస్తున్న వాలంటీర్లు | Andhra Pradesh Volunteers Protesting for Their Jobs

WhatsApp Group Join Now

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల సమస్యలు తీవ్రమవుతున్నాయి. జీతాలు నాలుగు నెలలుగా అందకపోవడం, ప్రభుత్వం వాలంటీర్ ఉద్యోగాలపై ఏ విధమైన స్పష్టత ఇవ్వకపోవడంతోవాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలు, వికలాంగులు వంటి వర్గాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కర్నూలు, గుంటూరులో కలెక్టరేట్ వద్ద భారీ నిరసన

కర్నూలు మరియు గుంటూరులో కలెక్టరేట్ ముందు వాలంటీర్లు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వాలంటీర్లు తమ ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. “చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదు,” అంటూ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Andhra Pradesh Volunteers Protesting for Their Jobs
ఉద్యోగ భద్రత కోసం వాలంటీర్ల పోరాటం

ఉద్యోగ భద్రత కోసం వాలంటీర్ల పోరాటం

 “మాకు ఉద్యోగం ఉందా లేదా అనే సందేహం ఉంది, ఇది ఒక పెద్ద సమస్య,” అని వారు తెలిపారు. ఉద్యోగ భద్రతను నిర్ధారించాలని, వారి భవిష్యత్తు గురించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వాలంటీర్లు కోరుతున్నారు.

ప్రభుత్వంపై వాలంటీర్ల ఒత్తిడి

వాలంటీర్లు తమ సమస్యలు పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. “ప్రభుత్వం స్పందించకపోతే, మేము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం,” అంటూ వారు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి
కలెక్టరేట్ ను ముట్టడించిన విజయవాడ వరద బాధితులు

కొమురవెల్లిలో ఏడవ తరగతి బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడు


వీడియో

Andhra Pradesh Volunteers Protesting for their Jobs

1 thought on “ఉద్యోగ భద్రత కావాలని పోరాటం చేస్తున్న వాలంటీర్లు | Andhra Pradesh Volunteers Protesting for Their Jobs”

Leave a Comment