ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం వక్ఫ్ బోర్డ్ రద్దు. వైఎస్ఆర్‌సీపీ హయాంలో కొనసాగిన వక్ఫ్ బోర్డ్ ని కూటమి ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో తెలుసుకోవాలి. వక్ఫ్ అంటే ఏమిటో, ఎందుకు ఈ బోర్డ్ రద్దు అయ్యిందో తెలుసుకుందాం.
వక్ఫ్ అంటే ఏంటి?
వక్ఫ్ అనేది ముస్లిం సమాజంలో చారిటబుల్ సంస్థలకు అంకితం చేసిన ఆస్తి. దీని కింద ఇళ్లు, షేర్లు, పుస్తకాలు వంటి దానాలు చేస్తారు. వీటిని మసీదు, విద్యాసంస్థలు, దర్గా, గ్రేవ్‌యార్డ్స్, ఆసుపత్రులు మొదలైన వాటి కోసం వినియోగిస్తారు. ఈ విరాళాలను కేవలం 18 ఏళ్లు దాటిన ముస్లిం వ్యక్తులు మాత్రమే అందించగలరు.
వక్ఫ్ బోర్డ్ అవసరత ఏమిటి?
వక్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేసే ప్రధాన ఉద్దేశం ఈ ఆస్తుల పరిపాలన. ఈ బోర్డు 1954లో తెచ్చిన వక్ఫ్ యాక్ట్ కింద పనిచేస్తుంది. ముతవలి (Caretakers) లాంటి స్థానిక ప్రతినిధులు ఈ ఆస్తులను నిర్వహిస్తారు. అయితే, బోర్డు సభ్యులకు ఆస్తులపై ఎటువంటి అధికారం ఉండదు. కేవలం పరిపాలకులుగా వ్యవహరిస్తారు.
వక్ఫ్ బోర్డ్ రద్దుకు కారణం?
ప్రస్తుత కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్‌లో అవకతవకలను గుర్తించింది. ఈ కారణంగా బోర్డు రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బోర్డ్‌లో కేవలం అడ్మినిస్ట్రేటివ్ సభ్యులే ఉన్నారు, ఎలక్టెడ్ సభ్యులు లేరు.
ప్రభుత్వ ధోరణి ప్రకారం, బోర్డు కింద ఉన్న ఆస్తులను సక్రమంగా నిర్వహించేందుకు కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నారు. అవకతవకలను అరికట్టేందుకే జియో 47ను రద్దు చేశారు. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా పంచుకోండి.
ఇవి కూడా చదవండి
పేదలకు ఉచిత భోజనం అందిచబోతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు
షిప్ ని సీజ్ చెయ్యడం కుదరదు అన్న కస్టమ్స్ అధికారులు
1 thought on “ఆంధ్ర వక్ఫ్ బోర్డ్ రద్దు వెనుక నిజాలు | Andhra Waqf Board Dissolution”