అన్న కాంటీన్ లో అన్నం తినాలంటే భయపడుతున్న ప్రజలు | Anna Canteen Tanuku Viral Video

WhatsApp Group Join Now

Anna Canteen Latest News
Anna Canteen News in Telugu

పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది అన్న కాంటీన్ ల పరిస్థితి. పేరుకు మేము పెద్దవాళ్ళని మేము ఉద్ధరిస్తున్నాం 5 రూపాయలకే భోజనం పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం అన్న కాంటీన్ లను సరిగ్గా మైంటైన్ చెయ్యడంలో విఫలం అయ్యారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అన్న కాంటీన్ లో కనీస శుచి శుభ్రతలేకుండా మురికి నీళ్లతో అన్నం తినే ప్లేట్ లను కడుగుతున్న వీడియో ఒకటి ఈ మధ్య వైరల్ అయ్యింది.

పేదవాడంటే ఎందుకు అంత నిర్లక్ష్య ధోరణి అని వీడియో చూసిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ వీడియో వలన జనాలకి అన్నా కాంటీన్ లో తినాలంటేనే ఆలోచించాల్సి వస్తుంది. మొదలేసిన కొన్ని రోజులకే ఇలా ఉంటె ఇది ఎలా కొనసాగిస్తారో అని సందేహాలు ప్రజలకు వస్తున్నాయి. వీడియోలు ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగినందుకు ” ఇంట్లో పెళ్ళాం వదిలి వెళ్ళిపోయిన వెధవలు, అడుక్కుంటే వాళ్ళే కదా వచ్చేది. మేము ఇంతే చేస్తాం అనే నిర్లక్ష్య ధోరణి చూపించారు.  

ఇప్పటికైనా అధికారులు ఇలాంటివి ఎక్కడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. 

వీడియో

Anna Canteen Tanuku Viral Video

Webstory

Leave a Comment