ఫైనాన్షియర్ వేధింపులు భరించలేక ఆటోనే తగలబెట్టేసిన యజమాని | Auto Owner Sets Vehicle Fire Over Financier Harassment

WhatsApp Group Join Now

విజయవాడలో చోటు చేసుకున్న ఒక ఘటన అందరినీ ఆశ్చర్యపరచింది. కొన్నాళ్ల క్రితం ఫైనాన్స్ తీసుకుని ఆటో కొనుగోలు చేసిన ఒక యజమాని.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు.

ఇటీవల విజయవాడ వరదల వలన అతడి ఆదాయం సన్నగిల్లింది, ఆదాయం లేక కష్టాల్లో ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఫైనాన్షియర్ పైన తీసుకున్న రుణం చెల్లించేందుకు కొంత సమయం అడిగినప్పటికీ ఫైనాన్షియర్ వినలేదు.

వినకపోవడంతో నిరాశతో.. ఆటోనే తగలబెట్టిన యజమాని

ఎంత వేడుకున్నా ఫైనాన్షియర్ ఒప్పుకోకపోవడంతో ఆ ఆటో యజమాని ఆగ్రహంతో తన ఆటోను తగలబెట్టేలా పూనుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వారు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఘటన సోషల్ మీడియా, స్థానిక మీడియా ద్వారా విస్తృతంగా పాపులర్ అయింది.

సామాన్యులపై దౌర్జన్యాలు ఆపాలి

ఈ ఘటన సామాన్య ప్రజల ఆవేదనకు అద్దంగా మారింది. ఫైనాన్షియర్ దౌర్జన్యాలు, అధిక వడ్డీల కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనతో ఫైనాన్సర్ల ప్రవర్తనపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

తప్పుడు ప్రచారం పై వైఎస్ విజయమ్మ గారి హెచ్చరిక

వీడియో




Leave a Comment