నారాయణ కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి | Bachupally Narayana College Student Incident

WhatsApp Group Join Now

హైదరాబాద్, అక్టోబరు 21 (తాజావార్త): హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనూష అనుమానాస్పద రీతిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. దసరా సెలవుల తర్వాత కాలేజీకి వచ్చి కేవలం కొన్ని గంటల్లోనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

తల్లిదండ్రుల ఆవేదన

అనూష తల్లిదండ్రులు ఆమెను హాస్టల్‌లో వదిలి వెళ్ళిన కొద్దిసేపటికే, కాలేజీ యాజమాన్యం వారు ఆమె స్పృహ కోల్పోయిందని ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. తల్లిదండ్రులు అక్కడికి చేరుకునేలోపే అనూషను గాంధీ ఆసుపత్రికి తరలించారు, అప్పటికే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు.

మహిళా కమిషన్ సూచనలు – స్టాఫ్ మార్పు

ఘటనపై స్పందించిన మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, బాచుపల్లి నారాయణ కాలేజీ సిబ్బందిని పూర్తిగా మార్చాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా తనిఖీ చేసిన సమయంలో విద్యార్థులు సమస్యలు లేవనెత్తినప్పటికీ యాజమాన్యం వాటిని పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు. “ఇప్పటికీ సమస్యలు కొనసాగుతుండడం చాలా బాధాకరం,” అని ఆమె తెలిపారు

ప్రభుత్వం జోక్యం

ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్‌గా ఉందని శారద స్పష్టం చేశారు. అన్ని విద్యాసంస్థలలో తనిఖీలు నిర్వహించి, విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా కృషి చేయనున్నట్లు వెల్లడించారు.

విద్యార్థుల భద్రతపై ఆందోళనలు

ఈ ఘటన విద్యార్థుల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించడంలో విఫలమవుతున్నాయా? అనూష ఆత్మహత్య ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం కావాలని సూచిస్తోంది. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తూ, విద్యార్థుల భద్రతకు సంబంధించి మరిన్ని వివరాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్యపై ఆందోళన

దేశంలోనే తొలిసారి కొత్త తరహా విద్యుత్ వాహనాలును విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం

వీడియో

Bachupally Narayana College Student Suicide

Leave a Comment