బంగ్లాదేశ్ ను 15 సంవత్సరాలు గా పరిపాలిస్తున్నషేక్ హసీనా గారు, గత కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాత్మక నిరసనల తరువాత ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.
హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4న వేలాది మంది ప్రదర్శనలు నిర్వహించారు. దాని ఫలితంగా ఒక్కరోజే 97 మంది చనిపోయారు.

సోమవారం బంగ్లాదేశ్‌లో 4 లక్షల మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నానికి హసీనా రాజీనామా చేయడమే కాకుండా దేశం విడిచి పారిపోయింది.
ప్రధాని నివాసంపై వేలాది మంది ఆందోళనకారులు దాడి చేసినా సైన్యం వారిని అడ్డుకోలేదు.
తన రాజీనామా వార్తను ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ బంగ్లాదేశ్ ప్రజలకు అందించారు. ఇప్పుడు దేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు.
రాజీనామాకు కారణం
1. మొదట్లో స్వాతంత్ర సమరయోధుల పిల్లలకు 30% రిజర్వేషన్ ఉండేది, తర్వాత వెనుకబడిన జిల్లాలకు 30 శాతం. మళ్ళీ మహిళలకు 10% తరువాత వికలాంగులకు 1% రిజర్వేషన్ చేకూర్చ బడింది.
తరువాత స్వాతంత్రంలో పోరాడిన సైనికుల పిల్లలకే కాకుండా సైనికుల మనవాళ్లకు మానవరాళ్లకు కూడా ఈ రిజర్వేషన్ వర్తించే సరికి దీంతో సామాన్య విద్యార్థుల్లో ఆగ్రహం పెరిగింది. జనరల్ కేటగిరీలో 44 శాతం సీట్లు మాత్రమే మిగిలాయి.
గత నెలలో షేక్ హసీనా కోర్టు విచారణలను ఉటంకిస్తూ విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చడానికి నిరాకరించడంతో ప్రదర్శనలు తీవ్రమయ్యాయి.
2. బంగ్లా ప్రధాని హసీనా గారు నిరసన చేస్తున్నవారు విద్యార్థులు కారని, వాళ్ళు పాకిస్థాన్ కి చెందిన రజాకార్లని అనడం వలన, వాళ్ళ విద్యార్థి నాయకులను బలవంతంగా తీసుకెళ్లి పోలీసులతో కొట్టి చంపడం వలన ఉద్యమం ప్రబలింది.
తదుపరి నాయకుడు
బంగ్లాదేశ్ నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ ప్రధాని కావచ్చని, లేకపోతే మిలటరీ పాలన సాగవచ్చని ఊహ గానాలు వినిపిస్తున్నాయి.
హసీనా ప్రస్తుతం ఎక్కడ ఉంది?
ఆమె ప్రస్తుతం భారత దేశంలోనే ఉందని, UK నుండి అప్రూవల్ వచ్చాక లండన్ లో తన కుటుంబానికి చేరుకుంటారని అంటున్నారు.
హసీనా గారి ఇంటిపై దాడి
హసీనా గారు రాజీనామా చేసి దేశం వదిలి వెళ్ళిపోయిన తర్వాత నిరసన కారులు మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసారు.
మరియు ఆమె నివసిస్తున్న అధికారిక గృహం గణ భవన్ లోకి కూడా చొరబడి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి వంట గదిలోకి కూడా వెళ్లి అన్ని తినేసి రచ్చ రచ్చ చేసి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. ప్రధాని నివాసంపై వేలాది మంది ఆందోళనకారులు దాడి చేసినా సైన్యం వారిని అడ్డుకోలేదు.

హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన 3 విద్యార్థి నాయకులు
ఆసిఫ్ మహమూద్, నహిద్ ఇస్లాం మరియు అబూ బకర్ మజుందార్. వీరిని పోలీసులు అపస్మారక స్థితిలోకి వెళ్లేంతగా కొట్టారు
