ఆత్మహత్యకు యత్నించిన బెటాలియన్ కానిస్టేబుల్‌కు కేటీఆర్ భరోసా | Battalion Constable Commit Suicide

WhatsApp Group Join Now

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టీజీఎస్పీ థర్డ్ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ టైగర్ నాగేశ్వరరావు తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. ఫోన్‌ గుంజుకొని తన విషయాలు బయట పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో నాగేశ్వరరావు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కానిస్టేబుల్‌కు కేటీఆర్ భరోసా

కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేయడంపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన్ను ఫోన్‌లో సంప్రదించి ధైర్యం కల్పించారు. ప్రభుత్వం తనపై కక్షగట్టినట్లు భావిస్తున్న నాగేశ్వరరావుకు, ” ఏ సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి, ఎందాకైనా ధైర్యంగా కొట్లాడదామని కేటీఆర్ ధైర్యం చెప్పారు.

కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటామని హామీ

కేటీఆర్ తన కుటుంబానికి అండగా ఉంటానని, నాగేశ్వరరావు చెల్లి పెళ్లి నుంచి తల్లి ఆరోగ్యం వరకు అన్ని బాధ్యతలు తీసుకుంటామని భరోసానిచ్చారు. అంతేకాక, తన ఉద్యోగాన్ని తిరిగి పొందేందుకు కోర్టులో పోరాడుతామని హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, కేటీఆర్‌ ఇచ్చిన భరోసా కానిస్టేబుల్‌ కుటుంబ సభ్యులకు కొంత ఊరటనిచ్చింది.

ఇవి కూడా చదవండి

రైతు బీమా పథకం ఉందా?  ఆలస్యం ఎందుకు అవుతుంది – KTR!

పండగ వేళ రైతు గోస వినబడడం లేదా?  – KTR

వీడియో

2 thoughts on “ఆత్మహత్యకు యత్నించిన బెటాలియన్ కానిస్టేబుల్‌కు కేటీఆర్ భరోసా | Battalion Constable Commit Suicide”

Leave a Comment