జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థుల ఆందోళన | BC Gurukul Students Protest on National Highway

WhatsApp Group Join Now

విద్యార్థుల సమస్యలు మళ్లీ తెరపైకి

బాటసింగారం నవంబర్ 1 (తాజావార్త): రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద బీసీ గురుకుల విద్యార్థులు తమ సమస్యలపై తిరిగి మౌనాన్ని వీడి, ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు జాతీయ రహదారిపై బైఠాయించారు.

వినేవారే లేరని ఆరోపణలు

విద్యార్థులు పలు మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, తమ విన్నపాలను అధికారులు పట్టించుకోలేదని, సమస్యలు పునరావృతమవుతూనే ఉన్నాయని బాధపడుతున్నారు.

“మాకు కావలసిన సౌకర్యాలు (వసతులు) లేవు, ఆహారం సరిగా అందడం లేదు. ఎన్ని సార్లు చెప్పినా మార్పు రావడం లేదు” అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రహదారిపై ట్రాఫిక్ అంతరాయం

ఈ నిరసనతో రహదారిపై వాహనాల రాకపోకలు దెబ్బతిన్నాయి. ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ సమస్యలను పరిష్కరించేవరకు తమ నిరసన ఆగదని విద్యార్థులు స్పష్టంగా తెలిపారు.

ప్రతిపక్షం ఏమంటుందంటే

కాంగ్రెస్ అసమర్థ పాలనలో చిన్న పిల్లల నుంచి పెద్దవారికి వరకు ఎవ్వరూ సంతృప్తిగా లేరని, ప్రజల కష్టాలను పట్టించుకోవాల్సిన నేతలు, తమ స్వార్థం కోసం పోరాడుతుండడం బాధాకరం అని ఎద్దేవా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరులపై మావోయిస్టుల హెచ్చరిక

ఆత్మహత్యకు యత్నించిన బెటాలియన్ కానిస్టేబుల్‌కు కేటీఆర్ భరోసా

వీడియో

Leave a Comment