ఖమ్మం వరద బాధితులకు నెల జీతం విరాళం ప్రకటించిన BRS పార్టీ నాయకులు | BRS Party Leaders Announced Donation of Monthly Salary to Khammam Flood Victims

WhatsApp Group Join Now

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇళ్లను కోల్పోయిన వారు, ఆస్తులు నష్టపోయిన వారు, తిండి, మంచినీరు లాంటి ప్రాథమిక అవసరాలకు నోచుకోలేకపోతున్న ప్రజలను ఆదుకోవడానికి BRS పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది.

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పిలుపు మేరకు, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు తమ ఒక నెల జీతాన్ని వరద బాధితుల సహాయం కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విరాళం కష్టాల్లో ఉన్న ప్రజలకు కొంత కాస్త ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో తీసుకున్న మంచి నిర్ణయం.

సహాయ కార్యక్రమాలు

బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే విపత్తు బాధితులకు తక్షణ సహాయం అందిస్తోంది. తక్షణ అవసరాల కోసం ఆహారం, నీరు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు స్వయంగా సహాయ కార్యక్రమాలలో పాల్గొంటూ, ప్రజలకు తోడుగా నిలుస్తున్నారు.

BRS Party Leaders Helping Flood-Effected People in Khammam
BRS Party Leaders Helping Flood-Effected People in Khammam

ప్రజలకు పిలుపు

బీఆర్ఎస్ పార్టీ కేవలం తన సభ్యులతోనే కాదు, ఇతరులతో కూడా ముందుకు రావాలని పిలుపునిస్తోంది. విపత్తు సమయంలో ప్రజలందరూ ముందుకు వచ్చి, బాధితులకు తగిన సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.

వీడియో

Webstory

Leave a Comment