హైడ్రా బాధితులను పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు
బీఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్ హైదర్‌షాకోట్, మూసీ నది హైడ్రా బాధితులను కలుసుకుని వారి ఇళ్లను పరిశీలించారు. ప్రజలను ధైర్యంగా ఉండమని, తమపై నమ్మకం కోల్పోకూడదని నాయకులు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ ఇళ్లను ముట్టుకోకుండా బీఆర్‌ఎస్ మీ పక్కన నిలబడుతుందని తెలిపారు.

హైడ్రా వల్ల ప్రాణ నష్టం – బాధితులకు బీఆర్ఎస్ భరోసా
ఇప్పటికే హైడ్రా పుణ్యమా అని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, ఇకపై మీరు ఎలాంటి భయం పెట్టుకోకూడదని ప్రజలకు భరోసా ఇచ్చారు. తాము ముందుండి మీ ఇళ్లకు ఎలాంటి హాని కలగకుండా చూస్తామన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అనుమతులు – పేదల ఇళ్లు కూల్చడంపై విమర్శలు
1994లో కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులకు ఇచ్చిన అనుమతులను గుర్తు చేస్తూ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారి ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు.
రేవంత్ రెడ్డి పేదల ఇళ్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నారని, బుల్డోజర్లు, జేసీబీలు ఉపయోగించి పేదల ఇళ్లను కూలగొట్టేందుకు ముందుకు వస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ తమ్ముడి ఇల్లు కూడా అక్రమంగా ఎఫ్‌టీఎల్‌లో ఉందని, దాన్ని ముందుగా కూలగొట్టాలని హితవు పలికారు.
పేదలకు బీఆర్‌ఎస్ సపోర్ట్
బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పేదల పక్షాన నిలబడి ఇళ్లను కాపాడతారని భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి.
హైడ్రా బాంబు బ్లాస్ట్ లో హోమ్ గార్డ్ మరణంతో మాకు సంబంధం లేదని చెప్పిన హైడ్రా
కొమురవెల్లిలో ఏడవ తరగతి బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడు
2 thoughts on “మూసీ నది హైడ్రా బాధితులకు అండగా నిలిచిన BRS నాయకులు | BRS Stands with Moosi Victims”