తమిళనాడులోని మదురైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదైంది. మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మదురై న్యాయవాది ఈ కేసును పెట్టారు. ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది. తిరుపతిలో జరిగిన ఒక సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రత్యక్షంగా ప్రతిస్పందనగా కనిపిస్తున్నాయి.
పవన్ వ్యాఖ్యలు
తిరుపతిలో జరిగిన ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “సనాతన ధర్మాన్ని ఒక వైరస్‌తో పోలుస్తూ దాన్ని నాశనం చేస్తానని ఒక యువ నేత అంటున్నాడు. నీలాంటి వాళ్లు చరిత్రలో వచ్చారు, పోయారు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఉదయనిధి స్టాలిన్ మీదేనని ప్రచారం జరిగింది.

ఉదయనిధి స్టాలిన్ స్పందన
పవన్ కళ్యాణ్ మాటలు నేను పట్టించుకోను అతని మెంటాలిటీ ఎలా ఉంటుందో అతనికే తెలియదు ఒక్కసారి చేగువేరా అంటాడు ఇంకోసారి అంబేద్కర్ అంటాడు ఇంకోసారి స్వామి వివేకానంద బీఫ్ తినమన్నాడు అంటాడు ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు — ఉదయ్ నిది స్టాలిన్
సోషల్ మీడియా వార్: డిఎంకే vs బీజేపీ
ఈ వివాదం సోషల్ మీడియా వేదికగా విస్తరించింది. డిఎంకే సోషల్ మీడియా వింగ్ పవన్‌ను టార్గెట్ చేస్తూ పాత వీడియోలు, ట్రోల్స్‌ను విస్తృతంగా షేర్ చేస్తోంది. బీజేపీ వింగ్ పవన్‌కు మద్దతుగా కౌంటర్ ఇస్తూ, పవన్ పట్ల డిజిటల్ సమర్థన కల్పిస్తోంది.
సనాతన ధర్మం వివాదం
ఈ అంశం స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత తెరపైకి వచ్చింది. ఉదయనిధి స్టాలిన్, సనాతన ధర్మాన్ని వైరస్‌గా పోల్చుతూ, దాన్ని నాశనం చేయాలని చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ వివాదానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు విమర్శలు ఎదుర్కొన్నాయి, ముఖ్యంగా హిందూ ధార్మిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఇవి కూడా చదవండి
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన హీరో నాగార్జున గారు
నందిగం సురేష్ ఆరోగ్యం విషయమై ఆందోళన చెందుతున్న భార్య
1 thought on “పవన్ కళ్యాణ్ పై మధురైలో కేసు నమోదు | Case Filed Against on Pawan Kalyan”