తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరియు పీఏసీ ఛైర్మన్ ఆరికేపూడి గాంధీ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కౌశిక్ రెడ్డి గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు, గాంధీ బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారని, పీఏసీ ఛైర్మన్ పదవిని స్వీకరించారని చెప్పారు. దీనితో, కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా అందించి, పార్టీ జెండా ఎగరేస్తానని ప్రకటించారు.
ఈ ప్రకటన తర్వాత, గాంధీ, అతని అనుచరులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడులు చేశారు. ఈ దాడుల్లో గేట్లు, కిటికీలు, కుర్చీలు, పూల కుండీలు అన్నిటిని కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేసారు. ఈ ఘర్షణలో ఇరువైపులా గాయాలు సంభవించాయి. పోలీసులు ఈ ఘర్షణను ఆపేందుకు ప్రయత్నించకపోవడంతో, కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.
హరీష్ రావు అరెస్ట్
కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ మరియు అతని అనుచరులు దాడి చేయడంతో, విషయం తెలిసిన హరీష్ రావు కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్లారు.
అనంతరం, సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తున్న సమయంలో హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. CP కార్యాలయం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హరీష్ రావు అరెస్ట్ అయిన సమయం,లో కార్యకర్తల మధ్యలో పోలీసులు ఆయనను బలవంతంగా నెట్టుకుపోవడం వలన అయన చేతికి కొంత గాయం అయ్యింది. ఈ రోజు ఆయనను హాస్పిటల్ కు పోలీసులు తీసుకెళ్లారు.
సీఎం రేవంత్ రెడ్డి స్పందన
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ ఇమేజ్ దెబ్బతినేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు” అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
BRS నేతల హౌస్ అరెస్టులు
సునీత లక్ష్మారెడ్డి , మాలోతు కవిత ఇద్దరు హరీష్ రావుని కలిసేందుకు వచ్చినప్పుడు, మాజీ పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ కమిషనర్ అనుమతి లేకుండా హరీష్ రావుని కలవలేమని వారు స్పష్టం చేశారు. తరువాత వాళ్ళు వెళ్లకపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి,ఏ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తున్నారో కూడా చెప్పలేదు.
BRS నాయకులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే KP వివేకానంద, మాధవరం కృష్ణా రావు,R S ప్రవీణ్, జోగు రామన్న లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.
ఈరోజు గాంధీ ఇంటికి బయలుదేరిన కౌశిక్ రెడ్డి
ఈరోజు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఇద్దరు కలిసి కౌశిక్ రెడ్డి ఇంటి నుండి అరికెపూడి గాంధీ ఇంటికి బయలు దేరారు
పోలీసులు ఇద్దరినీ అడ్డుకుని లోపలికి పంపించి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
ఇది కూడా చదవండి – తెలంగాణ ల్యాబ్ టెక్నిషియన్ ఉద్యోగాలు
వీడియో
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి బయలుదేరిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు
కౌశిక్ రెడ్డిని, శంబిపూర్ రాజును ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని లోపలికి పంపించి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/bTSsKS3Ouc
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2024