రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
“రైతులను వేదించే వారు ఎవరైనా ఎస్సెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద కూడా చర్యలు తీసుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు.
రైతులను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
ఇటీవలి కాలంలో రైతులను వేధించే సంఘటనలు చోటుచేసుకోవడంతో సీఎం ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఎక్కడైనా ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు రక్షణ కల్పించాల్సిందిగా సంబంధిత అధికారులతో మాట్లాడారు.
జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు
రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలంటే అన్ని జిల్లాల కలెక్టర్లు కృషి చేయాలని సీఎం సూచించారు. ఎక్కడైనా రైతులు ఇబ్బందులకు గురైతే వెంటనే ఉన్నతాధికారులతో సంప్రదించి పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆదేశించారు.
రైతుల ప్రయోజనాలు ప్రధానం
రైతుల పంటలకు సరైన ధర చెల్లించేలా మరియు వారి ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రభుత్వ చర్యలు కొనసాగుతాయని సీఎం హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
గిరిజన పాఠశాలలో కాలం చెల్లిన మందులు ఇవ్వడంపై హరీష్ రావు ఫైర్
మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం అంటున్న కేసీఆర్
2 thoughts on “రైతులను ఇబ్బందిపెట్టేవారికి రేవంత్ రెడ్డి కఠిన హెచ్చరిక | CM Revanth Reddy Issues Key Orders on Paddy Procurement”