WhatsApp Group
Join Now
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వరదల కారణంగా, హిందుస్థాన్ కోకా కోలా బివరేజస్ (HCCB) వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో, కోకా కోలా AP రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన & అగ్నిమాపక సేవల విభాగానికి 60,000 కిన్లీ వాటర్ బాటిళ్లను సరఫరా చేసింది.

ఈ సహాయ కార్యక్రమంలో అగ్నిమాపక సేవల అధికారులు శ్రీ పి. వెంకట రమణ, శ్రీ తి. ఉదయ్ కుమార్, మరియు రెడ్ క్రాస్ సమన్వయకర్త శ్రీమతి అన్నమ్మ టీ గారు కీలక పాత్ర పోషించారు. ఎచ్‌సీసీబీ ప్రతినిధి హిమాంశు ప్రియదర్శి మాట్లాడుతూ, “సంక్షోభ సమయంలో తాగునీరు అందించడం మా బాధ్యత” అని పేర్కొన్నారు.
హెచ్‌సిసిబి వరద బాధితుల సహాయాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని చెప్పారు.
విజయవాడ వరదల గురించిన ఇతర న్యూస్