హైటెక్‌సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో దారుణం |  Doctor Dies at Medicover Over Payment Issue

WhatsApp Group Join Now

హైదరాబాద్ (తాజావార్త): హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో అనారోగ్యంతో చికిత్స కోసం చేరిన జూనియర్ డాక్టర్ నాగప్రియను ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చూపించి మరణానికి కారణమయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటి వరకు రూ. 3 లక్షలకు పైగా ఖర్చు చేసినా, ఇంకా డబ్బులు చెల్లించకుంటే మృతదేహం ఇవ్వబోమంటూ ఆస్పత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబ సభ్యుల ఆరోపణలు

కుటుంబసభ్యుల కథనం ప్రకారం, నిన్న అర్ధరాత్రి ఆస్పత్రి సిబ్బంది నుంచి మూడు లక్షలు చెల్లించాలని కోరుతూ ఫోన్ వచ్చినట్లు చెప్పారు. అయితే, ఆ డబ్బు చెల్లించకపోతే వైద్యం నిలిపివేస్తామని హెచ్చరించినట్లు వారు వెల్లడించారు. ఉదయాన్నే లక్ష రూపాయలు చెల్లించిన తర్వాత నాగప్రియ మరణించిందని సిబ్బంది తెలిపారు.

ఎమ్మెల్యే మాట విన్నా వినని ఆస్పత్రి సిబ్బంది

స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈ విషయంపై ఆస్పత్రి సిబ్బందిని కాంటాక్ట్ చేసినప్పటికీ, వారి మాటను సిబ్బంది పట్టించుకోకపోవడం ఇక్కడి పరిస్ధితిని మరింత ఇబ్బందికరంగా చేసింది.

వైద్యం నిలిపివేసి డబ్బు కోసం దౌర్జన్యంగా ప్రవర్తించిన హాస్పిటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నాగప్రియ కుటుంబసభ్యులు కోరుతున్నారు.

వైద్యం ఆపివేయడంతోనే మరణమా?

వైద్యం ఆపివేయడం వల్లే నాగప్రియ మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒక వైపు డబ్బు కోసం ప్రాణాలను లెక్క చేయకుండా ప్రవర్తించడం చూసి, స్థానికులు ఆస్పత్రి సిబ్బందిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తప్పుడు ప్రచారం పై వైఎస్ విజయమ్మ గారి హెచ్చరిక

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరులపై మావోయిస్టుల హెచ్చరిక

2 thoughts on “హైటెక్‌సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో దారుణం |  Doctor Dies at Medicover Over Payment Issue”

Leave a Comment