తెలంగాణ మాజీ డిజిటల్ మీడియా డైరెక్టర్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ దిలీప్ కొణతం అరెస్టు చెందారు. పోలీసులు అతన్ని నిర్బంధించడానికి గల కారణాలు కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు. దిలీప్ గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

దిలీప్ అరెస్ట్‌ను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు (కేటీఆర్) ఈ అరెస్టును అసంబద్ధమైనది, అన్యాయమైనదిగా అభివర్ణించారు. కేటీఆర్ మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రయత్నం అని, విపక్ష నేతలను దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం చూస్తూ ఉన్నామని తెలిపారు.
దిలీప్ అరెస్ట్ అనేది స్వేచ్ఛా స్వరాన్ని అణచివేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రయత్నం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ అరెస్టు పట్ల హైకోర్టు గతంలోనే హెచ్చరించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పద్ధతిని కొనసాగిస్తూ ప్రజాస్వామ్య సూత్రాలను ధిక్కరిస్తోందని ఆయన అన్నారు
వీడియో
Revanth Reddy,
If you think, you can intimidate any Telangana son/daughter by illegally arresting them and using coercion, you’re just another autocratic delusional fool
Dileep was arrested purely because he questioned your Govt’s failure on the flood relief, he kept exposing…
— KTR (@KTRBRS) September 5, 2024