మల్కాపూర్ చెరువులో డిటోనేటర్లు పెట్టి కట్టడాలను కూల్చిన అధికారులు, హోంగార్డు గోపాల్ చనిపోవడానికి హైడ్రాకి సంబంధం లేదని చెబుతుండడం సిగ్గుచేటు అని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. హోంగార్డు గోపాల్ కుటుంబానికి న్యాయం చేయాలని, వారికి సాయం అందించాలనే డిమాండ్ చేశారు.
బిల్డింగ్ కూల్చివేతలో అపశృతి
సంగారెడ్డి – మల్కాపూర్ గ్రామంలో పెద్ద చెరువులో నిర్మించిన మూడు అంతస్తుల భవనాన్ని బాంబులతో కూల్చేసిన అధికారులు
కూల్చివేత సమయంలో శిథిలాలు తగిలి తీవ్రంగా గాయపడ్డ హోం గార్డ్. https://t.co/GTe0nNbBQt pic.twitter.com/7qpg52a0Q6
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2024
హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా సృష్టిస్తోందని, దీనికి బాధ్యత తీసుకోకుండా తప్పించుకోవడం సరికాదని హరీష్‌రావు అన్నారు. హోంగార్డు గోపాల్ మరణంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఈ ప్రమాదానికి హైడ్రా అధికారుల తీరును సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్నారు.

హైడ్రా స్పందన
హైడ్రాపై అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. హైడ్రా సంగారెడ్డిలో కూల్చివేతల పని చేపట్టలేదని, హోంగార్డు గోపాల్ మరణానికి హైడ్రాకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఫిర్యాదులపై దృష్టి
ప్రస్తుతం, ప్రభుత్వం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని చెరువులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను సమీక్షించాలని నిర్ణయించింది. ప్రభుత్వ అనుమతులతో ఉన్న నిర్మాణాలను కూల్చడంపై జాగ్రత్తగా వ్యవహరించాలనే సూచనలు వినిపిస్తున్నాయి.
హైకోర్టు ఆగ్రహం
తెలంగాణ హైకోర్టులో కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హైకోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు. అమీన్పూర్ తహసిల్దార్ వివరణపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం రోజు ఎలా కూల్చివేత చేపట్టారని ప్రశ్నించారు.
అమీన్పూర్ లో హాస్పిటల్ భవనం కూల్చివేతపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రోజుల ముందు మాత్రమే నోటీసు ఇచ్చి, 48 గంటలు కూడా గడవకముందే కూల్చివేత చేయడాన్ని ప్రశ్నించింది. ముఖ్యంగా ఆదివారం సెలవు రోజున కూల్చివేత చేయడం ఏ చట్టం ప్రకారం అనేది కోర్టు ప్రశ్నించింది.
హైకోర్టు తహసిల్దార్ చెబుతున్న వివరణకు అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేకపోవడంతో కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ ఇంకా కొనసాగుతుండగా, రంగనాథ్ వివరణ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది.
ఇది కూడా చదవండి – కొమురవెల్లిలో ఏడవ తరగతి బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడు
వీడియో
Webstory
1 thought on “హోంగార్డు గోపాల్ మరణంపై హైడ్రా వ్యవహారంపై హరీష్‌రావు ఆగ్రహం | Harish Rao Criticizes Hydra Over Home Guard Gopal Death”